వైఎస్సార్సీపీలో 300 మంది టీడీపీ కార్యకర్తల చేరిక
లక్కవరపుకోట/జామి/వేపాడ: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మంది వైఎస్సార్సీపీలో చేరారు.
శనివారం సామాజిక సాధికార బస్సు యాత్ర జమ్మాదేవిపేటకు చేరుకున్న వేళ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సమక్షంలో పార్టీలో చేరిన నాయకులకు రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో వేపాడ మండలం మాజీ ఎంపీపీ దొగ్గ శ్రీదేవి, కుమ్మపల్లి కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు దొగ్గ సూరిదేముడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దొగ్గ శ్రీనివాసరావు, కుమ్మపల్లి మాజీ సర్పంచ్ దొగ్గ లక్ష్మి తదితరులు ఉన్నారు.