సంక్షేమ పథకాల అమలు జగన్‌కే సాధ్యం
గరివిడి, న్యూస్‌లైన్ : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయగల సత్తా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వెదుళ్లవలస గ్రామంలో చీపురుపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త ఎస్.సిమ్మినాయుడు సమక్షంలో టీడీపీకి చెం దిన 300 కుటుంబాల నుంచి సుమారు 800 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గురువారం రాత్రి చేరారు. ఈ సందర్భంగా పెనుమత్స మాట్లాడుతూ ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
రాష్ట్రా న్ని సమైక్యంగా ఉంచేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం కుమ్మక్కైందని ఆరోపించారు. సిమ్మినాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి చీపురుపల్లిపై ప్రత్యేక దృష్టి ఉందన్నారు. చీపురుపల్లి ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల వరహాలనాయుడు మాట్లాడుతూ భవిష్యత్ వైఎస్ఆర్ సీపీదేనని చెప్పారు. పార్టీలోకి చేరిన వారిలో మన్నెపురి చిట్టి, దాలినాయుడు, సూర్యనారాయణ, నెమ్మాది వెంకటరమణ, తాలాడ జగదీష్, గుడివాడ సుందరరావు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు తుమ్మగంటి సూరినాయుడు, వాకాడ శ్రీను, కర్రోతు రమణ రోబ్బి రమణ, కొమ్ము శంకరరావు, సీహెచ్ సత్యనారాయణ రెడ్డి, కెల్ల సూర్యనారాయణ, కోటగిరి కృష్ణమూర్తి, ఇప్పిలి నీలకంఠం, గవిడి సురేష్ పాల్గొన్నారు.