ఎస్టీ ఎంప్లాయీస్ జాతీయ కార్యవర్గం
ఎస్టీ ఎంప్లాయిస్ అండ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ కార్యవర్గం ఎన్నికైంది. విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుంభా రాంబాబు (పశ్చిమగోదావరి), ప్రధాన కార్యదర్శిగా కె.సుబ్బారావు (హైదరాబాద్), కోశాధికారిగా బి.రామస్వామి (విజయవాడ), వర్కింగ్ ప్రెసిడెంట్గా జె.హరిబాబు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డి.ఉషారాణి, ఎన్.గంగరాజు, డి.వసుమతి, బి.నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. వీరితో పాటు నలుగురు కార్యదర్శులు, ఆరుగురు ఆర్గనైజింగ్ కార్యదర్శులు, నలుగురు సంయుక్త కార్యదర్శులు, మరో నలుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు కుంభా రాంబాబు మాట్లాడుతూ తమ సంఘం బోగస్ సర్టిఫికెట్లతో ఎస్టీల అవకాశాలను దోచుకునేవారిపై పోరాటం సాగిస్తుందన్నారు.