సాఫ్ట్‌బాల్ విజేత సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి
ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: ఇంటర్ జూనియర్ కాలేజి బాలికల సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి జట్టు చేజిక్కించుకుంది. కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజి జట్టుకు రెండో స్థానం లభించగా, మహర్షి జూనియర్ కాలేజి జట్టుకు మూడో స్థానం దక్కింది. బేగంపేట్‌లోని మహర్షి జూనియర్ కాలేజి మైదానంలో జరిగిన ఫైనల్లో సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి జట్టు 9-5 స్కోరుతో కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజి జట్టుపై గెలిచింది. విజేతలకు అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ మాజీ ఆటగాడు వదిరాజ్ ట్రోఫీలను అందజేశారు.
టగ్ ఆఫ్ వార్ చాంప్ కస్తూర్బా: టగ్ ఆఫ్ వార్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజి జట్టు గెలుచుకుంది. ఫైనల్లో కస్తూర్బా జట్టు 2-1తో సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజి జట్టుపై గెలిచింది.