బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ సేవలు
హన్మకొండ అర్బన్ : ఇంతకాలం ఔట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా సిబ్బంది నియామకాలు చేపట్టి వారితో సంక్షేమ హాస్టళ్లలో పనులు చేయించుకున్న ప్రభుత్వం.. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలకనుంది. హాస్టళ్లలో చేయాల్సిన వివిధ రకాల పనులు కేటగిరీల వారీగా విభజించి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ శాఖల్లో తొలిసారిగా అమలు చేయనున్న ఈ విధానంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి. అయితే ప్రస్తుతం ప్రవేశ పెడతున్న విధానం కొత్తది కావడంవల్ల సాధ్యాసాధ్యాలు, లాభ నష్టాలు అంచనాలతో నివేదికలు ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పనిలో పనిగా ఈ విద్యాసంవత్సరం ఆఖరులో(మార్చి ఆఖరు) ఈ విధానం క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అన్ని పనులూ ఔట్ సోర్సింగ్కే..
ఈ విధానం ద్వారా హాస్టల్లో ఉన్న పిల్లల సంఖ్య ఆధారంగా ఒక్కో హాస్టల్కు విడిగా టెండర్లు పిలవనున్నారు. హాస్టల్ పిల్ల లకు కావాల్సిన అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనా లు, స్నాక్స్ వంటివి టెండరు పొందిన కాంట్రాక్టర్... పిల్లలకు తయారు చేసి అందజేయాలి. ఉదాహరణకు ఒక హాస్టల్లో 50మంది విద్యార్థులు ఉన్నట్లయితో వారికి సంబందించి స రుకులు ప్రతిరోజూ హాజరు ప్రకారం వార్డెన్ సిద్ధంగా ఉంచు తారు. వాటిని కాంట్రాక్టర్ తన సిబ్బందితో హాస్టల్లోనే వం డి విద్యార్ధులకు వడ్డన చేయించాలి. ఇక పారిశుద్ధ్యం విష యంలో కూడా ఇదే పద్ధతి. హాస్టల్లో టాయిలెట్స్, పరిస రాలు శుభ్రం చేసే పనిని కూడా కాంట్రాక్టర్కు ఇస్తారు. ఒ ప్పందం ప్రకారం ప్రతి రోజూ పరిశుభ్రత పనులు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు హాస్టల్ విద్యార్థుల రక్షణ కోసం వాచ్మన్ను ఏర్పాటు చేసి రక్షణ కల్పించే విషయంలో కూడా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లకు ఇవ్వనున్నారు.
49 హాస్టళ్లలో అమలుకు చర్యలు
జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 49 హాస్టళ్లలో ఈ విధమైన ఔట్ సోర్సింగ్ సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 49 ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మొత్తం 2800 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరికి సేవలు అందించేందుకు నిబంధనల ప్రకారం ఒక్కో హాస్టల్కు ఒక కామాటి, కుక్, వాచ్మెన్ ఉండాలి. మొత్తంగా 96మంది ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నియామకాలే లేని కారణంగా ఉద్యోగ విరమణ చేసి పోతున్నవారి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం 96 మందికి 52 మంది మాత్రమే ఉన్నారు. ఇక వార్డెన్ల విషయంలో 32మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 17పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ సేవల వల్ల సిబ్బంది కొరత సమస్య కూడా తీరుతుందని ప్రభుత్వం లెక్కలేస్తోంది.
ఉద్యోగుల్లో ఆందోళన
హాస్టల్లో సేవలు పూర్తిగా ఔట్ సోర్సింగ్ ద్వారా పొందాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సిబ్బందిలో ఆందోళన మొద లైంది. ఒకవేళ ప్రభుత్వం ఇదే విధానంతో కొనసాగితే రానున్న రోజుల్లో క్లాస్ ఫోర్త్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థక మే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న వారిని ఎక్క డో ఓ చోట సర్దుబాటు చేస్తామని అధికారులు చెపుతున్నా... కొత్త నియామకాలు చేపట్టే అవకాశాలపై స్పష్టత లేదు. పను లన్నీ ఔట్ సోర్సింగ్ ద్వారా పొందిన తరువాత ఇక పూర్తి స్థాయి సిబ్బందితో పెద్దగా పని ఉండకపోవచ్చని అంటున్నా రు. ఇదే సమయంలో ప్రయోగాత్మకంగా అమలైదేగానీ పరిస్థితిపై ఓ అంచనాకు రాలేమని స్థానిక అధికారులు అంటున్నారు.
త్వరలో టెండర్లు పిలుస్తాం
జిల్లాలో మార్చి ఆఖరునుంచి ఔట్సోర్సింగ్ ద్వారా సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. శాఖ మంత్రి, కమిషరేట్ నుంచి ఆదేశాలు అందాయి. ముందుగా ఇలాంటి విధానం అమలవుతున్న గురుకులాల్లో పరిశీలించాలని నిర్ణయానికి వచ్చాం. ఒకటి రెండు రోజుల్లో ఇది పూర్తి చేసి టెండర్లు పిలుస్తాం. కార్యక్రమం మొదలయ్యాక లాభనష్టాలు పరిశీలిస్తాం. కుకింగ్, శానిటేషన్, సెక్యురిటీ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ సేవలు పొందాలని నిర్ణయించాం.
- జి.హృషికేష్రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి
అక్రమాలు తగ్గే అవకాశం..
ఒక వేళ భోజనం విషయంలో ఔట్సోర్సింగ్ విధానం ద్వారా పనులు చేపడితే మాత్రం కొంతలో కొంతైనా విద్యార్ధులకు న్యాయం జరుగుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రసుత్తం ప్రభుత్వం ఇచ్చిన బీసీ హాస్టళ్లకు ఇచ్చిన మెనూలో 50శాతం కూడా క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ధరల పెరుగు దల, బిల్లుల చెల్లింపు వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధానంతో కొంతమేరకైనా వి ద్యార్ధులకు నాణ్యమైన భోజనం లభించే అవకాశం ఉం దని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాం ఘిక సంక్షేమ గురుకులాల్లో టెండర ్లవిధానం కొంత తేడా గా ఉన్నప్పటికీ విజయవంతంగా విధానం అమలు అవుతోంది.