విలువలు పెంపొందించాలి
మంత్రి ఈటల రాజేందర్
కరీంనగర్ కల్చరల్ : ప్రస్తుత సమాజంలో మానవవిలువలు, కుటుంబ సంబంధాలు అంతరించిపోయాయని వాటిని పెంపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక సంఘం, తెలంగాణ రంగస్థల సాంస్కృతిక కళాకారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలను ఆదివారం స్థానిక కళాభారతిలో ఆదివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సినిమాలు, టీవీలలో ప్రసారమయ్యే సీరియల్స్ మానవ విలువలు తగ్గేంచేలా ఉంటున్నాయన్నారు. ప్రభుత్వం కళలు, కళాకారులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు గోపాల్రావు, రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, జిల్లా అధ్యక్షుడు వంగల సుధాకర్ పాల్గొన్నారు.