stalking charges
-
వంద పేజీల లేఖ.. ఇదేం లవ్ రా సామి!
100 Pages Harassment Letter.. Indian Origin Student Sahil Bhavnani Expelled From UK University For Stalking: ఆ యువకుడు ఆ అమ్మాయి ఒకే కాలేజ్‌లో చదువుతున్నారు. ఓరోజు లవ్ ప్రపోజ్ చేశాడు. జీవితాన్ని పంచుకుంటానని బతిమాలాడాడు. ఆసక్తి లేదని చెప్పింది. అయినా ప్రయత్నాలు మానలేదు. ‘ఛీ కొట్టింది’. కోపంలో ‘వెరైటీ’గా బెదిరింపులకు దిగాడు. వాయిస్ మెసేజ్‌లతో వేధించాడు. స్నేహితులతో భయపెట్టించాడు. ఏకంగా వంద పేజీల లేఖ రాసి ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. కానీ, యువతి ధైర్యం చేసి ఫిర్యాదు చేసింది. ఆ ప్రేమోన్మాదికి సరైన శిక్షే పడింది!. ఓ యువతి(26)ని వేధించిన కేసులో భారత సంతతికి చెందిన ఒక విద్యార్థికి తగిన శిక్షే పడింది. సాహిల్ భవ్నానీ(22) అనే స్టూడెంట్ ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్శిటీలో ఓ నర్సింగ్ విద్యార్థిని(విదేశీ యువతి!)ని వేధించిన కేసులో బహిష్కరణ శిక్షకు గురయ్యాడు. నాలుగు నెలల శిక్షతో పాటు రెండేళ్ల వేటు, ఐదేళ్ల పాటు బహిష్కరణ శిక్షను ప్రకటించింది ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు కోర్టు. ఒకవేళ తీర్పును ఉల్లంఘిస్తే.. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తామని కోర్టు అతన్ని స్ట్రాంగ్‌గానే హెచ్చరించింది. ఇదిలా ఉంటే సాహిల్‌కు కాలేజ్‌లోనే కిందటి ఏడాది ఆ యువతితో పరిచయం అయ్యింది. లవ్ ప్రపోజ్ చేస్తే.. ఆమె ఒప్పుకోలేదు. ఓరోజు ఆరు నిమిషాల వాయిస్ సందేశం పంపాడు. ఆ వాయిస్ సందేశంలో ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని, పిల్లలను కని సంతోషకరమైన జీవితం గడుపుదామని కోరాడు. ఆమె ససేమీరా అంది. అక్కడితో ఆగకుండా వంద పేజీల లేఖతో ఓ బెదిరింపు లేఖను కొరియర్ చేశాడు. దీంతో ఆమెలో భయం మొదలైంది. ఆపై తన స్నేహితులతోనూ లొంగిపోవాలని, లేకుంటే పరిణామాలు వేరేలా ఉంటాయని ఆమెకు దమ్కీ ఇప్పించాడు. దీంతో సాహిల్ లైంగిక దాడికి పాల్పడతాడనే భయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వెంటపడి వేధించిన నేరం ఒప్పుకోవడం, యువతికి నిందితుడు ఎలాంటి హాని చేయలేదన్న వాదనతో శిక్ష మోతాదును తగ్గించింది ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు. ఇక తన నేరాన్ని ఒప్పుకున్న సాహిల్.. మూడు నెలలపాటు గూగుల్‌లో కవితల్ని చదివి.. ఆపై ఆ వంద పేజీల రాక్షస ప్రేమ లేఖను సిద్ధం చేశాడట!. నిజానికి కిందటి నెలలోనే ఈ కేసులో వాదనలు పూరైనప్పటికీ.. తీర్పు ఆలస్యం(జనవరిలో)గా వెలువడుతుంది అంతా అనుకున్నారు. అయితే భవ్నానీ శనివారం తన తండ్రితో కలిసి హాంకాంగ్‌కు వెళ్తున్నాడన్న సమాచారం తెలియడంతో న్యాయమూర్తి నిగెల్ డాలీ ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టులో తీర్పును ప్రకటించారు. ‘ఇప్పటికైనా ఆ అమ్మాయి వెంటపడవనే అనుకుంటున్నా’ అంటూ జడ్జి భవ్నానీని ఉద్దేశించి సున్నింతగా మందలించారు. మరోవైపు యూకే యూనివర్సిటిల్లో విద్యార్థినులపై వేధింపుల ఘటనలు ఎక్కువగానే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర స్థాయి చర్చకు దారితీసింది. చదవండి: విదేశాలకు చెక్కేస్తున్న దేశ మిలియనీర్లు..! -
యూఎస్ జైలులో భారత అణుశాస్త్రవేత్త కష్టాలు
మీరట్: ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ తరుణ్ కే భరద్వాజ్ అనే భారతీయ అణుశాస్త్రవేత్తను టెక్సాస్‌లోని జైలులో వేసి ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది (2016) నుంచి ఆయనను తన విధులకు కూడా హాజరుకానివ్వకుండా అందులో ఉంచి వేధిస్తున్నారు. ఈ విషయంపై భరద్వాజ్ స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. అక్రమంగా జాతివివక్షతో తనను డిటెన్షన్ సెంటర్లో ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఏ అండ్ ఎం అనే విశ్వవిద్యాలయంలో తాను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని అది సహించలేక జాతి వివక్షతోనే తనను జైలులో పెట్టి విసిగిస్తున్నారని అన్నారు. ‘జాతి వివక్షకు నేనొక బాధితుడిని. ఆ వర్సిటీలో పెద్ద మొత్తంలో చేస్తున్న అవినీతిని నేను ఫిర్యాదు చేశాను. ఆ కేసును వెనక్కు తీసుకోకపోవడంతో నాపై తప్పుడు ఆరోపణలు చేసి విధుల్లో నుంచి తొలగించి ఇలా అరెస్టు చేయించారు. ఒకమ్మాయిని ఇష్టపడటం తప్పేం కాదు.. అయినా, ఆమెను వేధించానంటూ ఆరోపణలు నమోదు చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. భదర్వాజ్ కుటుంబం ప్రస్తుతం భారత్‌లోని బులంద్ షహర్లో ఉంటోంది. బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ లో పీహెచ్డీ పూర్తి చేసిన భరద్వాజ్ 2007లో అమెరికాకు పరిశోధకుడిగా వెళ్లాడు. అక్కడే అణుపదార్థాల్లో కెమికల్ క్యారక్టరైజేషన్‌లో ప్రత్యేక పరిశోధనను టెక్సాస్‌లోని ఏ అండ్ఎం యూనివర్సిటీలో చేశాడు. ఇటీవల ఆయన ప్రొఫైల్ కూడా సదరు వర్సిటీ ప్రొఫైల్ నుంచి తొలగించారు. ఈ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సమయంలోనే పలుమార్లు వివిధ ఆరోపణల పేరిట 2015 జనవరి, ఆగస్టు నెలల్లో అతడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం అతడిపై ఓ అమ్మాయిని వేధించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, అతడు పనిచేసే సమయంలో చేతికి ధరించాలని చెప్పిన జీపీఎస్ యాంకిల్ మోనిటరింగ్ డివైస్ నుంచి అక్రమంగా తీసేసినట్లు అందులో పేర్కొన్నారు. దాంతో 2016 డిసెంబర్ 29 నుంచి బ్రాజోస్లోని డిటెన్షన్ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారంట. అయితే, అతడి సోదరుడు ప్రసూన్ భరద్వాజ్ స్పందిస్తూ తన సోదరుడిని జాతి వివక్షకు బలిచేస్తున్నారని చెప్పారు. ఆ యూనివర్సిటీలో చూపిస్తున్న జాతి వివక్షను, అవినీతిని బహిర్గతం చేయడంతోనే అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణ కేసు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించాడు. ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణ పూర్తయ్యాక తరుణ్‌ను అమెరికా నుంచి పంపించి వేస్తారని ఆయన తరుపు న్యాయవాది చెప్పారు.