వంద పేజీల లేఖ.. ఇదేం లవ్‌ రా సామి! | Indian Origin Student Sahil Bhavnani Expelled From UK University For Stalking | Sakshi
Sakshi News home page

వంద పేజీల లేఖ.. ఇదేం లవ్‌ రా సామి!

Published Sat, Dec 11 2021 11:40 AM | Last Updated on Sat, Dec 11 2021 12:03 PM

Indian Origin Student Sahil Bhavnani Expelled From UK University For Stalking - Sakshi

100 Pages Harassment Letter.. Indian Origin Student Sahil Bhavnani Expelled From UK University For Stalking: ఆ యువకుడు ఆ అమ్మాయి ఒకే కాలేజ్‌లో చదువుతున్నారు. ఓరోజు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.  జీవితాన్ని పంచుకుంటానని బతిమాలాడాడు. ఆసక్తి లేదని చెప్పింది. అయినా ప్రయత్నాలు మానలేదు. ‘ఛీ కొట్టింది’. కోపంలో ‘వెరైటీ’గా బెదిరింపులకు దిగాడు. వాయిస్‌ మెసేజ్‌లతో వేధించాడు. స్నేహితులతో భయపెట్టించాడు.  ఏకంగా వంద పేజీల లేఖ రాసి ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు.  కానీ,  యువతి ధైర్యం చేసి ఫిర్యాదు చేసింది.  ఆ  ప్రేమోన్మాదికి సరైన శిక్షే పడింది!.  


ఓ యువతి(26)ని వేధించిన కేసులో భారత సంతతికి చెందిన ఒక విద్యార్థికి తగిన శిక్షే పడింది.  సాహిల్ భవ్నానీ(22) అనే స్టూడెంట్‌ ఆక్స్‌ఫర్డ్ బ్రూక్స్ యూనివర్శిటీలో  ఓ నర్సింగ్‌ విద్యార్థిని(విదేశీ యువతి!)ని వేధించిన కేసులో బహిష్కరణ శిక్షకు గురయ్యాడు. నాలుగు నెలల శిక్షతో పాటు రెండేళ్ల వేటు, ఐదేళ్ల పాటు బహిష్కరణ శిక్షను ప్రకటించింది ఆక్స్‌ఫర్డ్‌ క్రౌన్‌ కోర్టు కోర్టు. ఒకవేళ తీర్పును ఉల్లంఘిస్తే..  ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తామని కోర్టు అతన్ని స్ట్రాంగ్‌గానే హెచ్చరించింది. 


ఇదిలా ఉంటే సాహిల్‌కు కాలేజ్‌లోనే కిందటి ఏడాది ఆ యువతితో పరిచయం అయ్యింది. లవ్‌ ప్రపోజ్‌ చేస్తే.. ఆమె ఒప్పుకోలేదు. ఓరోజు ఆరు నిమిషాల వాయిస్‌ సందేశం పంపాడు. ఆ వాయిస్‌ సందేశంలో ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని, పిల్లలను కని సంతోషకరమైన జీవితం గడుపుదామని కోరాడు. ఆమె ససేమీరా అంది. అక్కడితో ఆగకుండా వంద పేజీల లేఖతో ఓ బెదిరింపు లేఖను కొరియర్‌ చేశాడు. దీంతో ఆమెలో భయం మొదలైంది. ఆపై తన స్నేహితులతోనూ లొంగిపోవాలని, లేకుంటే పరిణామాలు వేరేలా ఉంటాయని ఆమెకు దమ్‌కీ ఇప్పించాడు. దీంతో సాహిల్ లైంగిక దాడికి పాల్పడతాడనే భయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు.  వెంటపడి వేధించిన నేరం ఒప్పుకోవడం, యువతికి నిందితుడు ఎలాంటి హాని చేయలేదన్న వాదనతో శిక్ష మోతాదును తగ్గించింది ఆక్స్‌ఫర్డ్‌ క్రౌన్‌ కోర్టు.  ఇక తన నేరాన్ని ఒప్పుకున్న సాహిల్‌.. మూడు నెలలపాటు గూగుల్‌లో కవితల్ని చదివి.. ఆపై ఆ వంద పేజీల రాక్షస ప్రేమ లేఖను సిద్ధం చేశాడట!. 


నిజానికి కిందటి నెలలోనే ఈ కేసులో వాదనలు పూరైనప్పటికీ.. తీర్పు ఆలస్యం(జనవరిలో)గా వెలువడుతుంది అంతా అనుకున్నారు.  అయితే భవ్నానీ శనివారం తన తండ్రితో కలిసి హాంకాంగ్‌కు వెళ్తున్నాడన్న సమాచారం తెలియడంతో న్యాయమూర్తి నిగెల్ డాలీ ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్టులో తీర్పును ప్రకటించారు. ‘ఇప్పటికైనా ఆ అమ్మాయి వెంటపడవనే అనుకుంటున్నా’ అంటూ జడ్జి భవ్నానీని ఉద్దేశించి సున్నింతగా మందలించారు. మరోవైపు యూకే యూనివర్సిటిల్లో విద్యార్థినులపై వేధింపుల ఘటనలు ఎక్కువగానే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర స్థాయి చర్చకు దారితీసింది.

చదవండి: విదేశాలకు చెక్కేస్తున్న దేశ మిలియనీర్లు..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement