Oxford University Student
-
వంద పేజీల లేఖ.. ఇదేం లవ్ రా సామి!
100 Pages Harassment Letter.. Indian Origin Student Sahil Bhavnani Expelled From UK University For Stalking: ఆ యువకుడు ఆ అమ్మాయి ఒకే కాలేజ్‌లో చదువుతున్నారు. ఓరోజు లవ్ ప్రపోజ్ చేశాడు. జీవితాన్ని పంచుకుంటానని బతిమాలాడాడు. ఆసక్తి లేదని చెప్పింది. అయినా ప్రయత్నాలు మానలేదు. ‘ఛీ కొట్టింది’. కోపంలో ‘వెరైటీ’గా బెదిరింపులకు దిగాడు. వాయిస్ మెసేజ్‌లతో వేధించాడు. స్నేహితులతో భయపెట్టించాడు. ఏకంగా వంద పేజీల లేఖ రాసి ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. కానీ, యువతి ధైర్యం చేసి ఫిర్యాదు చేసింది. ఆ ప్రేమోన్మాదికి సరైన శిక్షే పడింది!. ఓ యువతి(26)ని వేధించిన కేసులో భారత సంతతికి చెందిన ఒక విద్యార్థికి తగిన శిక్షే పడింది. సాహిల్ భవ్నానీ(22) అనే స్టూడెంట్ ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్శిటీలో ఓ నర్సింగ్ విద్యార్థిని(విదేశీ యువతి!)ని వేధించిన కేసులో బహిష్కరణ శిక్షకు గురయ్యాడు. నాలుగు నెలల శిక్షతో పాటు రెండేళ్ల వేటు, ఐదేళ్ల పాటు బహిష్కరణ శిక్షను ప్రకటించింది ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు కోర్టు. ఒకవేళ తీర్పును ఉల్లంఘిస్తే.. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తామని కోర్టు అతన్ని స్ట్రాంగ్‌గానే హెచ్చరించింది. ఇదిలా ఉంటే సాహిల్‌కు కాలేజ్‌లోనే కిందటి ఏడాది ఆ యువతితో పరిచయం అయ్యింది. లవ్ ప్రపోజ్ చేస్తే.. ఆమె ఒప్పుకోలేదు. ఓరోజు ఆరు నిమిషాల వాయిస్ సందేశం పంపాడు. ఆ వాయిస్ సందేశంలో ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని, పిల్లలను కని సంతోషకరమైన జీవితం గడుపుదామని కోరాడు. ఆమె ససేమీరా అంది. అక్కడితో ఆగకుండా వంద పేజీల లేఖతో ఓ బెదిరింపు లేఖను కొరియర్ చేశాడు. దీంతో ఆమెలో భయం మొదలైంది. ఆపై తన స్నేహితులతోనూ లొంగిపోవాలని, లేకుంటే పరిణామాలు వేరేలా ఉంటాయని ఆమెకు దమ్కీ ఇప్పించాడు. దీంతో సాహిల్ లైంగిక దాడికి పాల్పడతాడనే భయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వెంటపడి వేధించిన నేరం ఒప్పుకోవడం, యువతికి నిందితుడు ఎలాంటి హాని చేయలేదన్న వాదనతో శిక్ష మోతాదును తగ్గించింది ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు. ఇక తన నేరాన్ని ఒప్పుకున్న సాహిల్.. మూడు నెలలపాటు గూగుల్‌లో కవితల్ని చదివి.. ఆపై ఆ వంద పేజీల రాక్షస ప్రేమ లేఖను సిద్ధం చేశాడట!. నిజానికి కిందటి నెలలోనే ఈ కేసులో వాదనలు పూరైనప్పటికీ.. తీర్పు ఆలస్యం(జనవరిలో)గా వెలువడుతుంది అంతా అనుకున్నారు. అయితే భవ్నానీ శనివారం తన తండ్రితో కలిసి హాంకాంగ్‌కు వెళ్తున్నాడన్న సమాచారం తెలియడంతో న్యాయమూర్తి నిగెల్ డాలీ ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టులో తీర్పును ప్రకటించారు. ‘ఇప్పటికైనా ఆ అమ్మాయి వెంటపడవనే అనుకుంటున్నా’ అంటూ జడ్జి భవ్నానీని ఉద్దేశించి సున్నింతగా మందలించారు. మరోవైపు యూకే యూనివర్సిటిల్లో విద్యార్థినులపై వేధింపుల ఘటనలు ఎక్కువగానే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర స్థాయి చర్చకు దారితీసింది. చదవండి: విదేశాలకు చెక్కేస్తున్న దేశ మిలియనీర్లు..! -
అమ్మానాన్నలపై కేసు పెట్టిన పుత్రరత్నం
లండన్: అవకాశం ఇస్తే అమ్మానాన్న మీద పడి బతికేవాళ్ళు ప్రపంచంలో చాలా మందే ఉన్నారనిపిస్తోంది ఇది చదివితే. ఏదో కాలో చెయ్యో సరిగ్గా లేదనుకుంటే సరే. కానీ అన్నీ ఉండీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పొంది కూడా తల్లిదండ్రులపైనే భారంమోపాలని భావిస్తున్నారు నాలుగు పదులు దాటిన ఓ పుత్రరత్నం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన 41 ఏళ్ళ దుబాయ్‌కి చెందిన ఫయాజ్ సిద్దిఖీ అనే వ్యక్తి ఇటీవల తన తల్లిదండ్రులపై ఓ విచిత్రమైన దావా వేశారు. తాను జీవించి ఉన్నంత కాలం తన తల్లిదండ్రులే తనకి ఆర్థిక సాయం చేయాలంటూ సదరు కుమారుడు కోర్టుకెక్కారు. ధనవంతులైన తన తల్లిదండ్రులే తన భారాన్ని జీవిత కాలం మోయాలంటూ కేసుపెట్టారు. అందుకు కారణం తన ఆరోగ్య సమస్యలని చెప్పారు సిద్దిఖీ. తన తల్లిదండ్రుల నుంచి డబ్బు రాకపోతే తన మానవ హక్కులు ఉల్లంఘనకు గురైనట్టేనంటారీయన. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన సిద్దిఖీ, కొన్ని చట్టపరమైన సంస్థల్లో పని కూడా చేశారు. అయితే 2011 నుంచి ఈయన నిరుద్యోగిగా ఉన్నారు. అంతేకాదు తనకి ఫస్ట్‌క్లాస్ రాకపోవడానికి ఆక్స్‌ఫర్డ్‌యూనివర్సిటీయే కారణమంటూ యూనివర్సిటీపై కూడా మూడేళ్ళ క్రితం దావా వేసేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ టీచింగ్ బాగాలేదని, అది తన కెరీర్‌కి నష్టం చేసిందని సిద్దిఖీ వాదించారు. లండన్‌లోని హైడ్ పార్క్‌లో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే తమ ఫ్లాట్‌లో తమ కొడుకుని 20 ఏళ్ళుగా ఎటువంటి అద్దె లేకుండా ఉచితంగా ఉండనిస్తున్నామని సిద్దిఖీ తల్లిదండ్రులు రక్షందా, జావేద్‌లు చెప్పారు. అంతేకాదు సిద్దిఖీ తల్లిదండ్రులు, తమ కొడుకు బిల్లులు కట్టడమే కాకుండా, ప్రతి వారం కొంత అదనంగా పంపిస్తున్నారు. అయితే కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇప్పుడు తమ కొడుకు సిద్దిఖీకి చేస్తోన్న ఆర్థిక తోడ్పాటులో కోత విధించాలని వారు భావిస్తుండడంతో సదరు కుమారుడు తల్లిదండ్రులపై కేసు పెట్టాడు. తాను తన తల్లిదండ్రుల నుంచి జీవితకాలం ఆర్థిక సాయం పొందేందుకు అర్హుడినని ఆయన వాదిస్తున్నారు. మెయింటెనెన్స్ కోరుతూ సిద్దిఖీ దాఖలు చేసిన పిటిషన్‌ని గత ఏడాది ఫామిలీ కోర్టు తోసిపుచ్చింది. యిప్పుడది ఎగువ కోర్టులో విచారణకు వచ్చింది. -
ఓ సెక్సువల్ అసాల్టర్!
నీ పేరేమిటో నాకు తెలియదు, అందుకే ఇలా సంబోధిస్తున్నా. నీ జీవితంలో ఎవరెవరున్నారో తెలియదు. నీ గురించి అసలు ఒక్క విషయం కూడా తెలియదు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నాకు తెలుసు. నీవు లైంగికంగా నాపై దాడి జరిపేందుకు నన్ను చిత్ర హింసలు పెట్టావు. జుట్టుపట్టుకొని లాగావు. మోకాళ్లపై కూలేశావు. రక్షణ కోసం అరవొద్దంటూ నా తలను నేలకేసి కొట్టావు. నొసటి నుంచి రక్తం కారింది. నా బ్రాను చింపేశావు. ఇంకేమో చేయాలనుకున్నావు. ఇంతలో వీధిలో అలజడి మొదలైంది. భయపడి నీవు పారిపోయావు. మరో 20 నిమిషాల తర్వాత మరో అమ్మాయి వెంటబడి సీసీటీవీ కె మేరాల ద్వారా దొరికిపోయావు. నీపై కేసు దాఖలైంది. నీ పై విచారణ కొనసాగుతోంది. వాస్తవానికి నీవు ఆరోజు లైంగికంగా దాడి జరిపింది నా ఒక్కదానిపైనే కాదు. నేనో కూతురుని. నేనో స్నేహితురాలిని. గర్ల్‌ఫ్రెండ్‌ను. నేనో శిష్యురాలిని. కజిన్‌ని. మేన కోడలిని. పొరుగింటిదాన్ని. నగరం నడిబొడ్డున కాఫీ షాప్‌లో చాయ్ అందించేదాన్ని. మేమంతా కలిసి ఒక కమ్యూనిటీ అవుతాం. మా అందరిలో ప్రతి ఒక్కరిపైనా నీవు లైంగిక దాడి జరిపావు. కానీ నేను, నాకు ప్రాతినిధ్యం వహించే వారు ఎదురు తిరిగి పోరాడతామన్న వాస్తవాన్ని నీవు విస్మరించావు. నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో చెడ్డవాళ్లకన్నా మంచివాళ్లదే మెజారిటీ. చీకటి పడ్డాక ఇంటికి రావడం క్షేమదాయకం కాదని నా కమ్యూనిటీ అసలు భావించదు. మేము అభద్రతా భావంలో బతకదల్చుకోలేదు. ఎంత చీకటైనా సరే మేము మా వీధుల్లో ఒంటరిగానే నడుస్తాం. ఆఖరి రైలు పట్టుకొని ఇంటికొస్తాం. ఒకరోజు మేమంతా ఒక సైన్యంలా ఒక్కటవుతాం. మాలో ఎవరికి ఏమైనా మేము పోరాడతాం. మీలాంటి వాళ్లతో పోరాడతాం. అంతిమ విజయం మాదే. -ఇట్లు లోన్ వెల్స్ (ఏప్రిల్ 11వ తేదీన లండన్‌లో రైలుదిగి ఒంటరిగా ఇంటికెళుతున్న లోన్ వెల్స్ అనే 20 ఏళ్ల అమ్మాయిపై 17 ఏళ్ల యువకుడు అత్యాచారా యత్నానికి ప్రయత్నించాడు. ఆ సంఘటన గురించి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్ పత్రిక ‘చెర్వెల్’కు బహిరంగ లేఖ రూపంలో లోన్ వెల్స్ దీన్ని రాసింది. ఈ లేఖను ‘నాట్ గిల్టీ’ కాలం కింద ఏప్రిల్ 24వ తేదీన ప్రచురించింది. ఇలాంటి దారుణ అనుభవాలు ఎవరికైనా ఉంటే పంపించండి ఈ కాలం కింద ప్రచురిస్తామంటూ ఆ పత్రిక తెలపడంతో అనేక మంది బాధితులు లేఖలు రాస్తున్నారు.)