అందరిని కలుపుకుపోయేవాడే నాయకుడు
లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ జనార్దన్‌రెడ్డి
నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
రామాయంపేట: అజమాయిషీతో కాకుండా అందరినీ కలుపుకుపోయేవాడే నాయకుడని లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్, ప్రముఖ న్యాయవాధి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి స్థానిక బాలాజీ ఫంక్షన్ హాలులో జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. లయనిజం అంటే మనల్ని మనం ఉద్దరించుకోవడమేనని తెలిపారు. క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతపర్చాలని సూచించారు.
మరో మాజీ జిల్లా గవర్నర్ గంప రమేశ్ మాట్లాడుతూ.. లయన్స్ ముఖ్య ఉద్దేశం సేవా కార్యక్రమాలేనన్నారు. క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ టీవీపీ చారి మాట్లాడుతూ.. పిల్లలకు చిన్నతనం నుంచే నైతిక విలువలు నేర్పించాలని సూచించారు. క్లబ్ రీజియన్ చైర్మన్ వలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. లయనిజం ప్రపంచంలోనే అతి పెద్ద సేవా సంస్థ అని పేర్కొన్నారు. క్లబ్ నూతన అధ్యక్షుడు వెంకటయ్య మాట్లాడుతూ.. అందరి సహకారంతో సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. రామాయంపేటలో లయన్స్ భవనం నిర్మాణానికిగాను కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రమాణ స్వీకారం...
నూతనంగా ఎన్నికైన క్లబ్ అధ్యక్షుడు వెంకటయ్య, కార్యదర్శి ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి దోమకొండ శ్రీనివాస్‌తోపాటు కొత్తగా చేరిన సభ్యులు నవాత్ సురేశ్, పవన్‌కుమార్, నర్సింహారెడ్డితో ఇన్స్ట్రలేషన్ అధికారి జనార్దన్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ సందర్బంగా క్లబ్ సభ్యులైన ప్రముఖ డాక్టర్లు టీవీపీ చారి, డాక్టర్ సురేందర్, డాక్టర్ రమేశ్‌లను సన్మానించారు. పాటలు పాడి అలరించిన చిన్నారులు మధులిక, ప్రణీత్‌ను కూడా సత్కరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్పర్సన్ లక్ష్మణ్ యాదవ్, ఇతర డైరెక్టర్లు మెదక్ రాములు ఆచారి, కైలాసం, దేమె యాదగిరి, చంద్రమౌళి, దారం రమేశ్, చప్పెట ముత్యంరెడ్డి, ఇందూరి రామాగౌడ్, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.