జార్ఖండ్: ప్రధాన అభ్యర్థులలో ఎవరెక్కడ?
జార్ఖండ్ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులుగా భావించినవాళ్లలో ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే...
* రాష్ట్ర రాజధాని నగరం రాంచీలో బీజేపీ అభ్యర్థి చంద్రవేశ్వర్ ప్రసాద్ విజయం సాధించారు.
* మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి అర్జున్ ముండా ఖరసవాన్ స్థానంలో వెనుకంజలో ఉన్నారు.
* మాజీ ముఖ్యమంత్రి మధు కోడా మఝఘానన్ స్థానంలో ఓడిపోయారు.
* ప్రస్తుత ముఖ్యమంత్రి, జేఎంఎం అభ్యర్థి హేమంత్ సోరెన్ డుమ్కా స్థానంలో వెనుకంజలో ఉన్నారు.
* ఏజేఎస్యూ అబ్యర్థి సుధేష్ కుమార్ మహతో సిల్లి స్థానం నుంచి ఓడిపోయారు.
* ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘువర్ దాస్ జంషెడ్పూర్ తూర్పు స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
* కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ సింగ్.. బెర్మో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
* బాగోదర్ నియోజకవర్గంలో సీపీఐ ఎంఎల్ అభ్యర్థి వినోద్ కుమార్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు.
* మాజీ ముఖ్యమంత్రి, జేవీఎం అభ్యర్థి బాబూలాల్ మరాండీ ధన్వార్ స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
* జేఎంఎం అభ్యర్థి శశాంక్ శేఖర్.. సరత్ స్థానంలో వెనుకంజలో ఉన్నారు.