start up company
-
పెట్రోల్ బంకుల వద్ద క్యూ.. ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు
బారెడు బారెడు ‘క్యూ’లు అంటే భయం లేనిది ఎవరికి?ఎందుకంటే బోలెడు టైమ్ వృథా అవుతుంది. అసహనం పెట్రోల్ ధరలా పెరుగుతుంది. ఫ్యూయల్ స్టేషన్ల దగ్గర పెద్ద పెద్ద ‘క్యూ’లను చూసిన, వాహనదారుల అసహనాన్ని విన్న అనుభవంతో వైభవ్ కౌశిక్ తన స్నేహితులు ఆలాప్ నాయర్, ఆర్యన్లతో కలిసి స్టార్ట్ చేసిన ‘నవ్గతీ’ స్టార్టప్ విజయపథంలో దూసుకుపోతోంది. కొన్ని సంవత్సరాల క్రితం గ్రేటర్ నోయిడాకు చెందిన వైభవ్ కౌశిక్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు క్యాబ్ ఒక ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆగింది. అక్కడ పెద్ద క్యూ ఉంది. చాలా టైమ్ తరువాత బండి రోడ్డు పైకి వచ్చింది.‘ఇలా అయితే కష్టం కదా’ అని డ్రైవర్‌తో మాటలు కలిపాడు వైభవ్.‘ఎప్పుడూ ఇదే కష్టం. టైమ్ వృథా అవుతుంది. బేరాలు పోతున్నాయి’ అసంతృప్తిగా అన్నాడు డ్రైవర్. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా’ అని ఆలోచించడం మొదలు పెట్టాడు వైభవ్. కొద్దిసేపటి తరువాత అతనిలో ఒక ఐడియా మెరిసింది. అదే నవ్గతీ. తన కాలేజీ ఫ్రెండ్స్ ఆలాప్ నాయర్, ఆర్యన్లతో కలిసి వైభవ్ కౌశిక్ స్టార్ట్ చేసిన నవ్గతీ (మార్గదర్శనం) స్టార్టప్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఇంధన స్టేషన్ల దగ్గర రద్దీ వల్ల వాహనదారుల టైమ్ వృథా కాకుండా, ప్రత్యామ్నాయ నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వన్–స్టాప్ ఫ్యూయల్ అగ్రిగేటర్ ΄ప్లాట్‌ఫామ్ రియల్–టైమ్ అప్డేట్స్ను అందిస్తుంది. రెండు సంవత్సరాల క్రితం దిల్లీలోని ఇంద్రప్రస్థ గ్యాస్‌స్టేషన్‌లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. డాటా–బ్యాక్డ్ ప్లాట్‌ఫామ్ ఆవెగ్, ఫ్యూయలింగ్ యాప్ అనే రెండు సర్వీసులను ఆఫర్ చేస్తోంది నవ్గతీ. బీ2సీ ఫ్యూయల్ డిస్కవరీ యాప్ ఫ్యూయల్ రేటు, అందుబాటు, సర్వ్ టైమ్...మొదలైన సమాచారాన్ని అందిస్తుంది. ఫ్యూయల్ స్టేషన్‌కు సంబంధించి రివ్యూకు అవకాశం కల్పిస్తుంది. ఇక ‘ఆవేగ్’ ద్వారా ఫ్యూయల్ స్టేషన్లకు సంబంధించి రవాణా సమయం, వెయిటింగ్ టైమ్, సర్వింగ్ టైమ్, వనరుల వినియోగం తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా... సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఫ్యూయల్ స్టేషన్లు తమ సర్వీసులను మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. ‘గతంలో ఫ్యూయల్ స్టేషన్లు కాంప్లయెన్స్ డిటైల్స్, లావాదేవీలు, అటెండెన్స్... వాటికి సంబంధించి డే–టు–డే డాటాను మాన్యువల్‌గా రికార్డ్ చేసేవి. ఇప్పుడు మాత్రం ‘ఆవేగ్’ రూపంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని యాక్టివిటీలను ఆటోమేట్ చేయవచ్చు. దీనివల్ల ఫ్యూయల్ స్టేషన్లు తమ సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. ఖర్చులు తగ్గించుకోవచ్చు’ అంటున్నాడు వైభవ్ కౌశిక్. ఇంద్రప్రస్థా గ్యాస్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్–దిల్లీ, మహానగర్ గ్యాస్ లిమిటెడ్–ముంబైకి సంబంధించిన 150 ఫ్యూయల్ స్టేషన్లలో ఈ స్టార్టప్ తమ ఎడ్జ్ కంట్రోలర్లను ఇన్స్టాల్ చేసింది. దేశంలోని పెద్ద పట్ణణాలతో పాటు చిన్న పట్టణాలలో కూడా విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంది.మొదట్లో సూపర్ యూజర్లతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. కొత్త ఫీచర్లను పరీక్షించడానికి, మెరుగు పరచడానికి ఈ గ్రూప్ బీటా టెస్టింగ్ గ్రూప్‌గా ఉపయోగపడింది. ఏకాంత ఆలోచనల్లో నుంచే కాదు చూసే సమస్యల్లో నుంచి కూడా స్టార్టప్ ఐడియాలు పుడతాయని, గట్టి కృషి చేస్తే సార్టప్ కలలు సాకారం అవుతాయని చెప్పడానికి ‘నవ్గతీ’ స్టార్టప్ ఒక ఉదాహరణ. View this post on Instagram A post shared by Vaibhav Kaushik (@_vaibhavkaushik) తెలియక పోయినా పట్టుదలతో... ఇరవై సంవత్సరాల వయసులో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. స్టార్టప్ ప్రపంచం ముఖ్యంగా ఫ్యూయల్–టెక్ గురించి పెద్దగా తెలియకపోయినా ఎప్పుడూ అధైర్యపడలేదు. వెనక్కి తగ్గలేదు. ఆసక్తి, పట్టుదలతో నేర్చుకున్నాం. సవాలుకు సక్సెస్‌తోనే జవాబు ఇవ్వాలనుకున్నాం. ‘ఐడియా బాగానే ఉందిగానీ వర్కవుట్ అవుతుందా?’ అని సందేహించిన వారికి కూడా మా సక్సెస్‌తో సమాధానం చెప్పాం. – వైభవ్ కౌశిక్, కో–ఫౌండర్, సీయివో నవ్గతీ స్టార్టప్ -
మిత్రులు సాధించిన విజయమిది.. స్టార్టప్ కంపెనీ సూపర్ సక్సెస్
వ్యాపారం చేయాలంటే అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుంటే సరిపోదు. నాలుగు గోడలు దాటి బయటి ప్రపంచంలోకి రావాలి. జనవాణి వినాలి. సృజనాత్మక వ్యూహాలు రూపొందించుకోవాలి. ఈ మిత్రులు అదే చేశారు. ‘ఎకోసోల్ హోమ్’తో ఘన విజయం సాధించారు... సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలతో మూడు సంవత్సరాల క్రితం రాహుల్ సింగ్, ప్రియాంకలు బోస్టన్ నుంచి నోయిడాకు వచ్చారు. ‘ఇదేమిటీ వింత’ అన్నట్లుగా చూశారు చుట్టాలు పక్కాలు. ‘ఇటు నుంచి అటు వెళతారుగానీ, అటు నుంచి ఇటు రావడం ఏమిటి?’ అనేది వారి ఆశ్చర్యంలోని సారాంశం. ‘రిస్క్ చేస్తున్నారు. అమెరికాలో సంపాదించిన డబ్బులను వృథా చేయడం తప్ప సాధించేది ఏమీ ఉండదు’ అన్నారు కొందరు. అయితే ఆ ప్రతికూల మాటలేవీ ఈ దంపతులపై ప్రభావం చూపలేకపోయాయి. ఇండియాకు రావడానికి ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వారికి బోలెడు సమయం దొరికింది. ‘మనం తీసుకున్న నిర్ణయం సరిౖయెనదేనా?’ నుంచి ‘ఎలాంటి వ్యాపారం చేయాలి...’ వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు.వ్యాపారమైనా సరే... అది కొత్తగా, సృజనాత్మకంగా, సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేలా ఉండాలనుకున్నారు. అలా వారి ఆలోచనలో నుంచి పుట్టిందే... ఎకోసోల్ హోమ్. అరవింద్ గణేషన్‌తో కలిసి రాహుల్ సింగ్ మొదలు పెట్టిన ఈ ఎకో–ఫ్రెండ్లీ హోమ్ ఎసెన్షియల్స్ కంపెనీ సూపర్ సక్సెస్ అయింది. రాహుల్, అరవింద్‌లు అమెరికాలోని ఇ–కామర్స్ కంపెనీ ‘వేఫేర్’లో పని చేశారు. ‘వేఫేర్లో పనిచేసిన అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడింది. వినియోగదారుల ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది? ఏది చేయాలి? ఏది చేయకూడదు? అనే విషయంలో స్పష్టత రావడానికి ఆ అనుభవం ఉపయోగపడింది. పర్యావరణ హితానికి సంబంధించిన వస్తువులకు డిమాండ్ పెరుగుతున్నట్లు విషయాన్ని గ్రహించాం. ఆ సమయంలోనే ఎకోసోల్ కంపెనీ ఆలోచన వచ్చింది’ అంటున్నాడు ఎకోసోల్ హోమ్ కో–ఫౌండర్ అరవింద్ గణేశన్. ‘అవగాహన కలిగించేలా, అందుబాటులో ఉండేలా, అందంగా ఉండేలా మా ఉత్పత్తులు ఉండాలనే లక్ష్యంతో బయలుదేరాం. ప్లాస్టిక్ వల్ల జరిగే హాని గురించి చాలామందికి అవగాహన ఉంది. అయితే దీనికి ప్రత్యామ్నాయం కావాలనుకున్నప్పుడు ధరలు ఆకాశంలో ఉండకూడదు. అందుకే మా వస్తువులకు అందుబాటులో ఉండే ధరలు నిర్ణయించాం’ అంటాడు రాహుల్ సింగ్. ఒకవైపు కోవిడ్ కల్లోలం భయపెడుతున్నా మరో వైపు ఇండియా, చైనా, థాయిలాండ్, మెక్సికోలలో తమ ఉత్పత్తులకు సంబంధించి సప్లై చైన్‌ను నిర్మించుకోవడానికి రంగంలోకి దిగారు. అయితే అది అంత తేలికైన విషయం కాదని అర్థమైంది. రా మెటీరియల్ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ వరకు అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ఒక్కొక్క సవాలును అధిగమిస్తూ 2021లో తాటి ఆకులతో తయారుచేసిన ప్లేట్లతో సహా 20 ఉత్పత్తులను విక్రయించడం మొదలు పెట్టారు. మనం రోజూ వినియోగించే ప్లాస్టిక్ ఫోర్క్‌లు, కప్‌లు, స్ట్రాలు, ప్లేట్స్... మొదలైన వాటికి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలు ఇందులో ఉన్నాయి. కంపెనీ నిర్మాణ సమయంలో వివిధ జిల్లాలకు చెందిన రైతులతో కలిసి పనిచేశారు రాహుల్, అరవింద్‌లు. వారు ఎన్నో అద్భుతమైన సలహాలు ఇచ్చారు. ‘తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే అడుగు తీసి అడుగు వేస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు’ అంటారు రాహుల్, అరవింద్. కిచెన్,డైనింగ్, టేబుల్‌టాప్, బాత్, పర్సనల్ కేర్....మొదలైన విభాగాల్లో 42 రకాలైన ఉత్పత్తులను అందిస్తోంది ఎకోసోల్ హోమ్. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో అయిదు వేల స్టోర్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పదివేల స్టోర్స్ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.‘మా ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. కంపెనీ ప్రారంభంలో వెంచర్ క్యాపిటల్స్‌ను సంప్రదించినప్పుడు ఎవరూ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఒక రిటైలర్ మాత్రం లక్ష రూపాయల చెక్ ఇచ్చాడు. అది మాకు ఎంతో విశ్వాస్వాన్ని ఇచ్చింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు రాహుల్, అరవింద్‌లు. More junk food, more plastic means more pollution! However, we can lessen the use of plastic with plastic-free products that are made with perfect high-quality that can be used for any events. Happy National Junk Food Day!https://t.co/yloDJONQ7I#NationalJunkFoodDay #SaveEarth pic.twitter.com/1chFc25XcX — EcoSoulHome (@EcoSoulHome1) July 21, 2021 A beautiful environment starts with you. Make the switch to reusable and 100% organic products and help our planet. Start with EcoSoul Home. Use the code ecosoul10 at checkout for 10% off all our products! 😍 #EcoSoul #LiveGreen #SaveTheEarth pic.twitter.com/fRDesyalby — EcoSoulHome (@EcoSoulHome1) May 24, 2021 -
ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ
ముంబై: వ్యాపారాల్లో విజయాలు అంత సులువుగా రావు. ఎన్నో కష్టాలు, అడ్డంకులు.. ఇలా ఎదురయ్యే ప్రతి వాటిని దాటుకుంటూ వెనకడుగు వేయక ముందుక సాగాల్సి ఉంటుంది. అలా ప్రయాణించిన ఓ పేద కుటుంబంలోని యువకుడు నేడు వేల కోట్ల కంపెనీకి సీఈవో అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ముస్తఫా పేద కుటుంబం నుంచి వచ్చాడు. తన తండ్రి.. రోజూ కూలీ పని చేస్తే గానీ మూడు పూటల తిండి దొరకని స్థితి. తను 6వ తరగతిలో ఫెయిల్ కావడంతో చదువు మానేసి కూలి పనులకు వెళ్లాలనుకుంటున్న తరుణంలో అతని స్కూల్ టీచర్ చొరవతో మళ్లీ స్కూల్‌కి వెళ్లే అవకాశం దక్కించుకోవడంతో పాటు స్కూల్లో టాపర్‌గా నిలిచాడు. చివరికి ఉద్యోగం సంపాదించి తన తండ్రి చేసిన అప్పులన్నింటినీ తీర్చేశాడు. అనంతరం విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం రావడంతో వెళ్లాడు. జీవితం సాఫీగా సాగుతున్నా ఏదో తెలియని వెలితే ఉన్నట్లు అనిపించింది. ఉద్యోగం కన్నా బిజినెస్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు అతని బంధువులలో ఒకరు నాణ్యమైన ఇడ్లీ-దోశ పిండి కంపెనీని ప్రారంభించాలనే ఆలోచనను ఇచ్చారు. అది నచ్చడంతో ముస్తఫా ₹ 50,000 పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టి తెలిసినవారికే వ్యాపార బాధ్యతలు అప్పగించి వెళ్లిపోయాడు. అయితే, మూడు సంవత్సరాల తర్వాత అతను తన పూర్తి సమయాన్ని కంపెనీపై దృష్టి పెడితేనే లాభాల్లోకి వెళ్తుందని గ్రహించి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అలా పూర్తి సమయాన్ని కంపెనీ కోసం కేటాయించినప్పటికీ ఒకానొక దశలో తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక కంపెనీలో షేర్లు ఇస్తానని మాటిచ్చాడు. అలా 8 ఏళ్ల పాటు అతని ప్రయాణం ఎన్నో కష్టాలను చవి చూశాక.. చివరకు తన కంపెనీకి ఓ పెద్ద ఇన్వెస్టర్ దొరికారు. 2000 కోట్ల రూపాయలను ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీ రూపురేఖలే మారిపోయాయి. కంపెనీ విస్తరించడంతో పాటు సేల్స్ కూడా పెరిగాయి. తాను చెప్పినట్లుగా అందులో ఉన్న ఉద్యోగులను లక్షాధికారులను చేశాడు. ప్రస్తుతం తన కంపెనీలో వందల మంది పనిచేస్తున్నారు. చదవండి: వినూత్న ఉద్యోగ ప్రయత్నం.. ఉద్యోగం కావాలంటూ హోర్డింగ్ ఏర్పాటు, అయినా..? -
మహిళా ఆర్థిక అక్షరాస్యులు
దేశంలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడేలా, అందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేలా మొట్టమొదటి స్టార్టప్ వచ్చింది. ఈ స్టార్టప్‌ను ప్రారంభించినది ఓ మహిళ. పేరు నిస్సారీ మహేష్. చెన్నైవాసి. బ్యాంకింగ్ రంగంలో 18 సంవత్సరాల అనుభవం ఉన్న నిస్సారీ పదినెలల్లో పాతికవేల మందిని ఒకేచోట చేర్చింది. ఆన్లైన్లో మహిళల కోసం నిసారీ ప్రస్తుతం ఫైనాన్షియల్ అవేర్నెస్ వర్క్‌షాప్ సిరీస్‌ను నిర్వహిస్తోంది. ఎవ్రీ మనీ టాక్స్ నిస్సారీకి రెండు సంస్థలు ఉన్నాయి. ‘హబ్ వర్డస్ మీడియా కంటెంట్ సర్వీస్’ ఒకటి. ఇది ఆన్లైన్ బ్రాండింగ్ సంస్థ. రెండవది ‘ఎవ్రీ మనీ టాక్స్’. ఇది మహిళ ల కోసం భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్. ఇది వారి ఆర్థిక పరిస్థితులను సరిగ్గా ప్లాన్ చేయడానికి సహాయపడుతుంది. నిసారీ మాట్లాడుతూ ‘చిన్న పెట్టుబడులు, ఆరోగ్య బీమా, పొదుపు ఖాతాలు, మైక్రో క్రెడిట్ రుణాలు వంటి ప్రాథమిక ఆర్థిక ఉత్పత్తుల గురించి తెలియని చాలా మంది మహిళలు మన దేశంలో ఉన్నారు. ఇలాంటి వాటి గురించి మహిళలకు తెలియజేయడం చాలా ముఖ్యం’ అంటారు నిస్సారీ. ఇది ఒక డిజిటల్ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్. ఫైనాన్షియల్ అవేర్నెస్ వర్క్‌షాప్ ఇది మహిళలకు ఆర్థిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికీ సహాయపడుతుంది. ఈ సంస్థ మొదటి 10 నెలల్లో 25 వేల మంది మహిళలను ఈ వేదిక మీదకు చేర్చింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా నిస్సారీ బృందం మహిళలకు ఆర్థిక ప్రణాళికలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఆన్లైన్లో మహిళల కోసం నిసారీ ఫైనాన్షియల్ అవేర్నెస్ వర్క్‌షాప్ సిరీస్‌ను నిర్వహిస్తోంది. ‘మహిళలు తమ కెరీర్, వ్యాపారం, ఆర్థిక ప్రణాళికలతో సాధికారత సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంతోషంగా ఉంది. ఫైనాన్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడం ద్వారా మహిళలల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది’ అని చెబుతుంది నిస్సారీ. -
వావ్.. వర్చువల్
సాక్షి, హైదరాబాద్: ప్రీమియం ప్రాంతాల్లో ఆఫీసు ప్రారంభించాలంటే స్థానికంగా స్థిరాస్తి ధరలను భరించడం అన్ని సంస్థలకు కుదరదు. పెద్ద కంపెనీలకు మినహాయిస్తే.. సూక్ష్మ,, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), స్టార్టప్ కంపెనీలతోటి అయ్యేపని కానేకాదు! మరెలా? ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తున్నాయి వర్చువల్ ఆఫీసులు. స్థలం, ఫర్నిచర్, వైఫై, ల్యాప్‌టాప్, సమావేశ గదులు వంటివెన్నో అద్దెకివ్వడమే ఈ కార్యాలయాల ప్రత్యేకత. ఈ రకమైన సేవలు వర్చువల్, సర్వీస్ ఆఫీసులని రెండు రకాలుగా ఉంటాయి. ఇంపీరియల్ సర్వ్కార్ప్, ఐకేవా, యూనీస్పేస్ కంపెనీలెన్నో ఈ రకమైన సేవలందిస్తున్నాయి. వర్చువల్ ఆఫీసు: ఆఫీసుకు చిరునామా, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్ సేవలుంటాయి. క్లయింట్లు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకునేందుకు ఓ రిసెప్షనిస్ట్ ఉంటుంది. ఆఫీసుకొచ్చే ఫోన్లు స్వీకరించి సంబంధింత యాజమాన్యానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ప్రారంభ ధరలు రూ,2 వేల నుంచి మొదలవుతాయి. ఇంట్లోనే ఉండి ఆఫీసును ప్రారంభించాలనుకునే వారికి ఇవి ఉపయుక్తం. సర్వీస్ ఆఫీసు: వీటిలో ఆఫీసును పెట్టుకునేందుకు వీలుగా అద్దెకు స్థలం కేటాయిస్తారు. చ.అ.లను బట్టి ధరలుంటాయి. సుమారుగా రూ.30 వేల నుంచి లక్షకు పైగానే ధరలుంటాయి. సమావేశ గదులు, వీడియో కాన్ఫరెన్స్, ఇంటర్నెట్ వంటివెన్నో వసతులుంటాయి. లాభమేంటో.. ⇔ కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టే వారు ఆ బిజినెస్‌ను ప్రజలు ఎలా స్వాగతిస్తారు? ఎలాంటి మార్పులవసరం వంటి అనేక అంశాలను తెలుసుకునేందుకు వర్చువల్ ఆఫీసులు ఉపయోగపడతాయి. ⇔ కంపెనీకి ప్రొఫెషనల్ బిజినెస్ అడ్రస్ వస్తుంది. అంతేకాకుండా అందరూ సులువుగా గుర్తు పట్టే ప్రాంతంలో ఆఫీసు అడ్రస్ ఉండటంతో కంపెనీపై నమ్మకం ఏర్పడుతుంది. ⇔ సొంతంగా ఆఫీసును పెట్టుకుంటే ఉద్యోగులు, భద్రతా సిబ్బంది వేతనాలు, విద్యుత్ చార్జీలు వంటివెన్నో స్వయంగా భరించాల్సి ఉంటుంది. అదే వర్చువల్ ఆఫీసుల్లో అయితే అవేమీ ఉండవు. ఆఫీసు స్థలానికి, రిసెప్షనిస్ట్‌కు డబ్బులు చెల్లిస్తే చాలు. ⇔ సొంతంగా ఆఫీసుంటే యజమాని ప్రతి రోజూ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఇందుకోసం కారు, బండి వాటిని వినియోగించాలి. దీంతో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరుల ఖర్చులూ భరించాల్సి ఉంటుంది. అదే వర్చువల్ ఆఫీసైతే యజమాని రోజూ ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇంధనం వినియోగం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు చేసినవారమవుతాం.