మార్కెట్లోకి స్వీకార్ ఆటో బ్యాటరీ వాహనాలు
• ప్యాసింజర్, కార్గో మోడల్ త్రిచక్ర వాహనాలు
• విడుదల చేసిన అడాప్ట్ మోటార్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అడాప్ట్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ మార్కెట్లోకి తొలిసారిగా బ్యాటరీ వాహనాలను విడుదల చేసింది. రూ.5 కోట్ల పెట్టుబడులతో స్వీకార్ పేరిట బ్యాటరీ ఆధారంగా నడిచే ప్యాసింజర్, కార్గో త్రిచక్ర వాహనాలను తయారు చేసినట్లు కంపెనీ ఎండీ భరత్ మామిడోజు శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. 2 ఎకరాల్లో పెద్ద అంబర్పేట్లోని ప్లాంట్లో ఈ వాహనాలను రూపొందించామని.. నెలకు 500 వాహనాల తయారీ సామర్థ్యం ఉందని వివరించారు.
ప్యాసింజర్ వాహనం ధర రూ.1.10 లక్షలు, కార్గో వాహనం ధర రూ.1.20 లక్షలుగా నిర్ణరుుంచామని పేర్కొన్నారు. 3 గంటల పాటు చార్జీంగ్ చేస్తే 70-90 కి.మీ. వరకు ప్రయాణించగలవని తెలిపారు. ‘‘తొలిసారిగా నిధులు సమీకరించనున్నాం. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రూ.10 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు. కంపెనీ విస్తరణ, వాహనాల తయారీ కోసం రూ.20 కోట్ల పెట్టుబడులు అవసరమని’’ వివరించారు.