state cadre
-
రాష్ట్ర కేడర్‌లోకి మండల వ్యవసాయాధికారులు
- జోనల్ వ్యవస్థ రద్దు నేపథ్యంలో వ్యవసాయ శాఖ కసరత్తు - సూపరింటెండెంట్ సహా మరికొన్ని పోస్టులు కూడా రాష్ట్ర కేడర్‌లోకే - ఏఈవోలను మాత్రం జిల్లా కేడర్లోనే ఉంచాలని ప్రాథమిక నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మండల వ్యవసాయాధికారి (ఏవో), సహాయ వ్యవసాయ డైరెక్టర్ (ఏడీఏ) పోస్టులను రాష్ట్ర కేడర్‌లోకి తీసుకురావాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటివరకు ఇవి జోనల్ పోస్టులుగా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థను రద్దు చేసి జిల్లా, రాష్ట్ర స్థాయి పోస్టులే ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం జిల్లా వ్యవసాయాధికారులు (డీఏవో), జాయింట్ డైరెక్టర్ (జేడీఏ), డిప్యూటీ డైరెక్టర్ (డీడీ), అదనపు డైరెక్టర్ పోస్టులు మాత్రమే రాష్ట్రస్థాయి కేడర్‌లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఏవో, ఏడీఏ పోస్టులు కూడా రాష్ట్ర కేడర్‌లోకి రానున్నాయి. దీనిపై వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి శనివారం సమీక్ష నిర్వహించారు. ఏవో, ఏడీఏలను రాష్ట్ర కేడర్‌లోకి తీసుకొస్తే తలెత్తే సమస్యలపై చర్చించారు. సీనియారిటీ సమస్యపై తర్జనభర్జన.. ఏవో, ఏడీఏ కేడర్ సహా సూపరింటెండెంట్ వంటి కొన్ని పోస్టులను జోనల్ స్థాయి నుంచి రాష్ట్ర కేడర్‌లోకి తీసుకురావడం వల్ల సీనియారిటీ సమస్యలు తలెత్తే అవకాశముందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జోనల్ వారీగా భర్తీ చేసినందున అక్కడున్న పరిస్థితుల కారణంగా కొందరు త్వరగా ఏవో నుంచి ఏడీఏగా పదోన్నతి పొందిన వారున్నారు. కొన్ని జోన్లల్లో ఆలస్యంగా పదోన్నతి పొందిన వారున్నారు. రాష్ట్రంలో 2 వేలకు పైగా వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టులు జిల్లా స్థాయి కేడర్లోనే ఉంటాయి. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు. ఏవోలుగా పదోన్నతి పొందాక రాష్ట్రస్థాయి కేడర్‌లోకి వస్తారు. సీనియారిటికీ ప్రాధాన్యమివ్వాలి: కె.రాములు, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జోనల్ వ్యవస్థను రద్దు చేయడం మంచిదే. అయితే జోనల్ పోస్టులు రాష్ట్రస్థాయి కేడర్‌లో కలిపాక పదోన్నతుల సమయంలో సమస్యలు వస్తాయి. అప్పుడు సీనియారిటీకే ప్రాధాన్యమివ్వాలి. -
సాగనంపారు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానికత (పుట్టిన ప్రాంతం) కలిగిన ‘స్టేట్ కేడర్’ విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుల నుంచి తక్షణమే రిలీవై ఏపీ ప్రభుత్వంలోని సంబంధిత విద్యుత్ సంస్థకు రిపోర్టు చేయాలని సూచిస్తూ ఆఘమేఘాలపై ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ట్రాన్స్‌కోలో 262 మంది, జెన్కోలో 522 మంది, ఎస్పీడీసీఎల్లో 393 మంది, ఎన్పీడీసీఎల్లో 168 మంది కలిపి మొత్తం 1,345 మంది ఏపీ ‘స్థానికత’గల స్టేట్ కేడర్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆయా సంస్థల సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం నుంచి ఈ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వహించేందుకు అనుమతించబోరని తెలుస్తోం ది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తుది కేటాయింపులపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో విభజన ప్రక్రియకు న్యాయపరమైన చిక్కులు అడ్డుకాక ముందే టీ.సర్కార్ యుద్ధప్రాతిపదికన ఉత్తర్వులు ఇచ్చింది. ఆలస్యం చేస్తే హైకోర్టు స్టే ఆర్డర్ వచ్చే అవకా శం ఉండటంతో ఈ ప్రక్రియను ముగించింది. ఆర్డర్ టు సర్వ్‌కు మంగళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల విభజన జరిగి ఏడాదైనా ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులందరూ ‘ఆర్డర్ టు సర్వ్’ ప్రాతిపదికనే పనిచేస్తున్నారు. టి.ట్రాన్స్‌కో, టి.జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో రాష్ర్ట, జోనల్, జిల్లా కేడర్ స్థాయిల్లో వేల మంది ఏపీ స్థానికతగల ఉద్యోగులున్నారు. ప్రభుత్వోద్యోగుల విభజన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కమల్‌నాథన్ కమిటీ ప్రభుత్వ సంస్థ (కార్పొరేషన్)ల ఉద్యోగుల విభజన తమ పరిధిలోకి రాదని గతంలోనే తేల్చేసింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 88 కేవలం ఏడాది వరకే ‘ఆర్డర్ టు సర్వ్’లో పనిచేసేందుకు అనుమతిస్తోంది. విభజన జరిగి ఏడాది పూర్తై నేపథ్యంలో ‘రాష్ట్ర స్థాయి’ విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయిం పులు జరపాలని ఈ నెల 6న తెలంగాణ ఇంధనశాఖ మార్గదర్శకాలు ఇచ్చింది. తక్షణమే తుది కేటాయింపులు జరపాలని ఈ నెల 9న విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఏపీ స్థానికతగల ఉద్యోగుల తుది జాబితాలను అదే రోజు ఆన్లైన్లో ప్రదర్శించాయి. మార్గదర్శకాలపై ఏపీ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేయగా కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై బుధ, గురువారాలు విచారణ జరగగా తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ క్రమంలో ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులను ఈ నెల 10న జారీ చేసినట్లు గురువారం బయటపడింది. తప్పు డు స్థానికత సమాచారమిచ్చిన విద్యుత్ ఉద్యోగులపై క్రిమినల్‌చర్యలు తీసుకునేలా మార్గదర్శకాల్లో నియమాలను చేర్చాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత జె.రఘు ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. విద్యుత్ సౌధకు పోలీసు భద్రత! విద్యుత్ ఉద్యోగుల విభజన నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని ‘విద్యుత్ సౌధ’ కార్యాలయానికి భద్రత కల్పించాలని టి.విద్యుత్ సంస్థలు పోలీసులను కోరాయి. ఏపీ ఉద్యోగులను తక్షణమే రిలీవ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై సదరు ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశాలుండటంతో ముందుజాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. -
ప్రస్తుతానికి ఎక్కడివారక్కడే!
సచివాలయం, హెచ్వోడీల్లోనే ఉద్యోగుల విభజన మార్గదర్శకాల వెల్లడిలో జాప్యం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులను విభజించకూడదని, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్న వారిని అక్కడే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు, సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ప్రస్తుతానికి తాము పనిచేస్తున్న స్థానాల్లోనే కొనసాగాల్సి ఉంటుంది. అరుుతే సచివాలయం, శాసనసభ, శాఖాధిపతుల కార్యాలయూల్లోని ఉద్యోగుల పంపిణీ మాత్రం తాత్కాలికంగా జరగనుంది. జూన్2న ఏర్పడనున్న రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగుల విభజనకు అనుసరించాల్సిన విధివిధానాల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటాయని అధికారులు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకి అనుసరించాల్సిన ముసాయిదా మార్గదర్శకాలు కూడా ఈనెల 8న వెలువడే అవకాశాల్లేవని సమాచారం. ఈనెల 20న మార్గదర్శకాలు వెల్లడించి 25వ తేదీకి తాత్కాలిక పంపిణీ చేస్తారని అధికారులు చెబుతున్నారు.