సచివాలయం, హెచ్‌వోడీల్లోనే ఉద్యోగుల విభజన మార్గదర్శకాల వెల్లడిలో జాప్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులను విభజించకూడదని, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్న వారిని అక్కడే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు, సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ప్రస్తుతానికి తాము పనిచేస్తున్న స్థానాల్లోనే కొనసాగాల్సి ఉంటుంది. అరుుతే సచివాలయం, శాసనసభ, శాఖాధిపతుల కార్యాలయూల్లోని ఉద్యోగుల పంపిణీ మాత్రం తాత్కాలికంగా జరగనుంది. జూన్2న ఏర్పడనున్న రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగుల విభజనకు అనుసరించాల్సిన విధివిధానాల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటాయని అధికారులు చెబుతున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకి అనుసరించాల్సిన ముసాయిదా మార్గదర్శకాలు కూడా ఈనెల 8న వెలువడే అవకాశాల్లేవని సమాచారం. ఈనెల 20న మార్గదర్శకాలు వెల్లడించి 25వ తేదీకి తాత్కాలిక పంపిణీ చేస్తారని అధికారులు చెబుతున్నారు.