రాష్ట్ర సరిహద్దుల్లో జూదం జోరు
రూ.1.39 లక్షల స్వాదీనం
నెల్లిపాక (రంపచోడవరం) :
రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర సరిహద్దుల్లో జూదం జోరందుకుంది. ఆంధ్రా సరిహద్దులు ఎటపాక సమీప తోటలు, అటవీప్రాంతాలను తెలంగాణ బడాబాబులు పేకాట స్థావరాలుగా ఎంచుకుంటున్నారు. ఎటపాకలోని పాల్రాజ్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని మామిడితోటలో పేకాట స్థావరంపై మంగళవారం రాత్రి డీఎస్పీ దిలీప్కిరణ్, ఎటపాక సీఐ రవికుమార్ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడితో పారిపోతున్న వారిని పోలీసులు వెంటపడి పట్టుకున్నారు. 17 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.1.39 లక్షలు, 5 ద్విచక్ర వాహనాలు, 20 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితులను కోర్టుకు పంపినట్టు చెప్పారు. దాడిలో పట్టుబడిన వారిలో తెలంగాణలోని దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం, సీతారాంపురం, భద్రాచలం, పాల్వంచ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టు చెప్పారు.