రాష్ట్ర క్రికెట్ ప్రాబబుల్స్‌కు ఆరుగురు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్ర క్రికెట్ ప్రాబబుల్స్‌కు జిల్లా నుంచి ఆరుగురు ఎంపికైనట్లు జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు మాంఛో ఫెర్రర్, కార్యదర్శి బి.ఆర్. ప్రసన్న ఓ ప్రకటన లో తెలిపారు. ఇటీవల కడపలో జరిగిన ఆంధ్ర అండర్–19 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీలో అనంతపురం జట్టు విజయకేతనం ఎగురవేసింది.
ఈ టోర్నీలో రాణించిన జిల్లా క్రీడాకారులు గిరినాథ్‌రెడ్డి (ఆల్‌రౌండర్), మహబుబ్పీరా(ఓపెనింగ్ బ్యాట్స్‌మన్), రాజశేఖర్ (మిడిలార్డర్ బ్యాట్స్‌మన్), ప్రవీన్‌కుమార్‌రెడ్డి (మిడిలార్డర్ బ్యాట్స్‌మన్), సంతోష్ (లెఫ్ట్ ఆర్మ్ పేస్), ముదస్సీర్ (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్)ఎంపికయ్యారు. ప్రాబబుల్స్ మ్యాచ్‌లు విజయవాడ లోని ముళ్లపాడులో నిర్మించిన మైదానంలో ఈ నెల 29 నుంచి 31 వరకు జరుగుతాయన్నారు. జిల్లా నుంచి ఆరుగురు ఎంపిక కావడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు.