రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
ఏలూరు అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ, జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్తో బుధవారం వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో అధికారులు జిల్లాలో ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. డివి జన్ల వారీగా ఇప్పటివరకూ ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఎందరు మరణించారు అనే వివరాలు సేకరించారు. రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా ప్రభుత్వం జిల్లాలో ఇప్పటివరకూ ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు తోడు మరో 13 వాహనాలను సమకూర్చిందని వాటిని ఎవరు మోనిటర్ చేస్తున్నారని, వాహనాలు వచ్చిన తర్వాత ప్రమాదాలను ఎంత మేరకు తగ్గించారని అడిగి తెలుసుకున్నారు. ఆయా వివరాలను డీఐజీ, ఎస్పీ గణాంకాలతో వివరించారు.