ఆంధ్రాబ్యాంక్ తడబాటు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ‘ఎ’ డివిజన్ మూడు రోజుల సూపర్ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రాబ్యాంక్ జట్టు బ్యాటింగ్‌లో తడబడింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
ఎస్బీహెచ్ బౌలర్ ఆల్ఫ్రెడ్ అబ్సలమ్ 36 పరుగులకు 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అంతకుముందు 113/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఎస్బీహెచ్ 69 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. అనూప్ పాయ్ (63) అర్ధ సెంచరీ సాధించగా, అబ్సలమ్ (33) రాణించాడు. ఆంధ్రా బౌలర్లలో అమోల్ షిండే, లలిత్ మోహన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
డెక్కన్ బ్లూస్ విజయం...
‘ఎ’ డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ బ్లూస్ 97 పరుగుల తేడాతో తారకరామ జట్టును ఓడించింది. సిరాజ్ ఫారూఖీ (65), సయ్యద్ ఆదిల్ (45) రాణించడంతో డెక్కన్ బ్లూస్ 200 పరుగులు చేసింది. అనిల్ 68 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తారకరామ 103 పరుగులకే ఆలౌటైంది. రహమత్ (30 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో జి. శ్రీనివాస్ (5/10) చెలరేగగా, కిరణ్ కుమార్‌కు 3 వికెట్లు దక్కాయి. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ సాధ్యపడకపోవడంతో భారతీయ-యంగ్ సిటిజన్, హెచ్‌జీసీ-హైదరాబాద్ పాంథర్స్ జట్ల మధ్య మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.