29న బాసరకు హైకోర్టు జడ్జి
ఆదిలాబాద్ : ఈ నెల 29న హైకోర్టు జడ్జి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ గౌరవ చైర్మన్ వి.రామసుబ్రహ్మణ్యం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రాత్రి బాసరకు చేరుకుంటారని, 30న ఉదయం సరస్వతీ అమ్మవారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి నిర్మల్ మీదుగా ఉట్నూర్‌కు వెళ్తారని తెలిపారు. గిరిజన హక్కులకు సంబంధించిన నల్సా చట్టంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి కుంటాల, పొచ్చర జలపాతాలతోపాటు కడెం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి జన్నారం మీదుగా నిజామాబాద్‌కు బయల్దేరి వెళ్తారని పేర్కొన్నారు.