రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ కోచింగ్ క్యాంపు ప్రారంభం
అనంతపురం సప్తగిరిసర్కిల్ : రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ కోచింగ్ క్యాంపు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైందని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. అండర్–14, 17 బాలికల రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు అనంత క్రీడా మైదానంలో క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపు ఈనెల 17 వరకు సాగుతుందన్నారు. ఖేలో ఇండియా పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపిక చేసినట్టు తెలిపారు. క్యాంపునకు కోచ్‌లుగా రఘు (గుంటూరు), రాజు(కర్నూలు) వ్యవహరిస్తారు. కోచింగ్ అనంతరం ఇరు జట్లు చెన్నైలో జరిగే జాతీయస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొంటాయి. అండర్–14, 17 బాలుర కోచింగ్ క్యాంపు విశాఖపట్టణంలో జరుగుతుందని ఆయన తెలిపారు.