State Office
-
'కాళేశ్వరం అవినీతిపై యాక్షన్ ఎప్పుడో ప్రారంభమైంది..'
హైదరాబాద్: కాళేశ్వరం అవినీతి మీద యాక్షన్ ఎప్పుడో ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ అన్నారు. తొందరలోనే బీజేపీ అభ్యర్థుల లిస్టు వస్తుందని చెప్పారు. తమ పార్టీలోకి వచ్చే వాళ్ళే తప్ప.. వెళ్ళే వారు లేరని అన్నారు. బీజేపీలో చేరేవారిని ఈ నెల 27న అందరూ చూస్తారని పేర్కొన్నారు. నేటి ప్రెస్ మీట్ ట్రైలర్ మాత్రమే.. మూవీ త్వరలో చూపిస్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్.. 9 ఏళ్లలో టీచర్, యూనివర్శిటీల్లో రిక్రూట్మెంట్ చేయలేదని మండిపడ్డారు. ఇచ్చిన నోటిఫికేషన్ లోనూ పేపర్ లీకేజీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కేసిఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత , సంతోష్, హరీష్ రావు లకు మాత్రమే ఎంప్లాయిమెంట్ దొరికిందని అన్నారు. కేసిఆర్ పర్యటన ఉన్న ప్రాంతాల్లో ప్రతిపక్షాల ముందస్తు అరెస్టు చేస్తున్నారని ప్రకాష్ జవదేకర్ దుయ్యబట్టారు. మాజీ మంత్రి, మహిళ అని చూడకుండా డీకే అరుణను అడ్డుకుని అరెస్ట్ చేయడం ఎంటని మండిపడ్డారు. తాము తెలంగాణ ప్రజల కోసం పోరాడతామని అన్నారు. బీజేపీకి భయపడే తమ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Hanumanth Rao Warns Harish Rao: సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా... మైనంపల్లి హనుమంత రావు -
రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పోరుబాట
విజయవాడ సెంట్రల్ : రైతాంగ సమస్యలపై త్వరలోనే కాంగ్రెస్‌పార్టీ పోరుబాటకు సిద్ధం కావాలని ఏపీసీసీ అ«ధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కిసాన్‌ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్‌సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలు ఎన్నికల్లో రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా ఉద్యమించాలన్నారు. కర్నూలులో నిర్వహించిన రైతు సభకు మంచి స్పందన వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు పావలావడ్డీ రుణాలు, వడ్డీలేని రుణాలు అందించామన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. పార్టీ నాయకులు గిడుగు రుద్రరాజు, టీజేఆర్ సుధాకర్‌బాబు, ఎస్.ఎన్.రాజా, తులసిరెడ్డి, రవిచంద్రరెడ్డి, కనుమూరి బాపిరాజు, కిసాన్‌సెల్ నాయకులు పాల్గొన్నారు. -
గోల్‌మాల్‌పై విచారణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పాత బోర్లకు... కొత్త పంపుసెట్లు కొన్నట్లు నాటకమాడి సబ్సిడీలు మింగేసినబాగోతంపై రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ స్పందించింది. అయిదుగురు సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది. కరీంనగర్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ మంజూరీ చేసిన బోరుబావులు, సబ్మెర్సిబుల్ పంపుసెట్ల యూనిట్లలో అవినీతి అవకతవకలపై విచారణ జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్యాలయంలో పని చేస్తున్న అయిదుగురు ఎగ్జిక్యూటివ్ అధికారులతో ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జయరాజ్ ఈ కమిటీని నియమించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, లబ్ధిదారులను కలువాలని.. యూనిట్ల మంజూరీలో జరిగిన అవకతవకలపై సమగ్ర నివేదికను అందజేయాలని ఈ కమిటీని ఆదేశించారు. వచ్చేవారంలో ఈ కమిటీ జిల్లాలో పర్యటిస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధ్రువీకరించారు. ఎస్సీ కార్పొరేషన్లో గత సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌లో ఈ గోల్మాల్ జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో 274 సబ్ మెర్సిబుల్ పంపుసెట్ల యూనిట్లు మంజూరు కావటం... దాదాపు రూ.57 లక్షల సబ్సిడీ సొమ్ము దుర్వినియోగమైన వైనాన్ని ‘టార్గెట్ గోల్మాల్’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. మెట్పల్లి ప్రాంతానికి చెందిన పంపుసెట్ల డీలర్ బ్యాంకర్లు, అక్కడి అధికారులతో కుమ్మక్కై... లబ్ధిదారుల ప్రమేయం లేకుండా సబ్సిడీని మింగేసినట్లుగా వేలెత్తి చూపింది. ఒక్కో యూనిట్‌పై రూ.30 వేల చొప్పున పక్కదారిపట్టడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సొంత జిల్లా కావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మరుసటి రోజునే జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. అసలేం జరిగిందని జిల్లా అధికారులను ఆరా తీశారు. మరోవైపు తమ బాగోతం బయటపడడంతో కొన్ని మండలాల్లో సబ్సిడీ సొమ్ముతో దాగుడుమూతలాడిన బ్యాంకర్లు, అక్కడి అధికారులు, స్థానిక నేతలు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో విచారణకు రానున్న కమిటీ ఏం నిగ్గు తేల్చుతుందో వేచి చూడాల్సిందే. ఇదే వరుసలో గతంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన జోగినీల పునరావాసం, అవినీతి, అక్రమాలకు సంబంధించి పెండింగ్ ఫైళ్ల దుమ్ము దులుపాలని... బాధ్యుల నుంచి డబ్బు రికవరీ చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. వరుస ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో చైర్మన్ లక్ష్మణ్‌కుమార్ ఈనెల 16న జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ పనితీరుపై సమీక్ష నిర్వహించనుండడం గమనార్హం.