విద్యుత్‌సౌధ వద్ద ఉద్రిక్తత, ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్ : ఖైరతాబాద్ విద్యుత్ సౌధ వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఈరోజు ఉదయం జేఎండీ పి.రమేష్‌కు సమ్మె నోటీసు అందచేశారు. అయితే ఆ నోటీసును ఆయన ఉద్యోగులపై విసిరి వేయటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
సమ్మె నోటీసు ఇచ్చేందుకు వెళితే జేఎండీ తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారంటూ ఉద్యోగులు విద్యుత్ సౌధ వద్ద ఆందోళనకు దిగారు. జేఎండీ రమేష్ తమకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తమ ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.