రోడ్ల పేరుతో ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే
గుంటూరు: రాజధాని పేరుతో ఇళ్లను తొలగించి రోడ్లు వేస్తున్న ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కృష్ణాయపాలెంలో ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం ఇళ్లను తొలగించి రోడ్లు వేస్తుండటంతో బాధితుల తరపున వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. బాధితులకు అనుకూలంగా స్టే ఇచ్చింది. స్టే కాపీలను ఆర్కే బాధితులకు అందించారు.