Steamed
-
పాన్ కేక్స్ నుంచి చికెన్ వరకు.. నిమిషాల్లో కుక్ అవుతాయ్
సౌకర్యవంతమైన మల్టీ కుక్వేర్ల సరసన చేరింది ఈ హార్డ్–బాయిల్డ్ స్టీమర్. ఇందులో వండివార్చుకోవడం భలే తేలిక. ఈ మెషిన్ లో గుడ్లు, జొన్నకండెలు, దుంపలు, కుడుములు వంటివన్నీ ఆవిరిపై ఉడికించుకోవచ్చు. ఆమ్లెట్స్, పాన్ కేక్స్ వంటివీ వేసుకోవచ్చు. అలాగే చికెన్ వింగ్స్, చిల్లీ చికెన్, గ్రిల్డ్ ఫిష్, క్రిస్పీ ప్రాన్స్ ఇలా చాలానే చేసుకోవచ్చు. కేక్స్, కట్లెట్స్ వంటివాటికీ పర్ఫెక్ట్ ఈ కుక్వేర్. దీని అడుగున, స్టీమింగ్ బౌల్‌లోనూ వాటర్ పోసుకుని.. ఎగ్ ట్రే మీద ఆహారాన్ని లేదా గుడ్లను పెట్టుకుని ఉడికించుకోవాల్సి ఉంటుంది. స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ మేకర్ని.. అడుగున నీళ్లు పోసుకుంటే స్టీమర్‌గా వాడుకోవచ్చు. నూనె వేసుకుంటే గ్రిల్‌గానూ మార్చుకోవచ్చు. వేగంగా, మంచిగా కుక్ అవ్వడానికి వీలుగా పెద్ద బౌల్ లాంటి మూత ఉంటుంది. దాంతో హోల్ చికెన్ వంటివీ కుక్ అవుతాయి. ఇందులో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైమర్ స్విచ్ ఉంటుంది. కుకింగ్ పూర్తి అయిన వెంటనే ఇండికేషన్ లైట్ వెలుగుతుంది. -
Health Tips: ఆవిరిపై ఉడికించిన ఆహారం తరచుగా తిన్నారంటే!
దాదాపు ఒక ఇరవై ఏళ్ల కిందటి వరకు జ్వరమొచ్చి తగ్గిన వాళ్లకి పొట్లకాయ, బీరకాయ, దొండకాయ, కాకరకాయ లాంటి కూరలు పథ్యం పెట్టేవాళ్లు పెద్దవాళ్లు. అదేవిధంగా నీరసంగా ఉన్న వాళ్లకి ఆవిరి కుడుముల లాంటివి పెట్టేవాళ్లు. ఇవి తేలికగా అరగడంతోపాటు వంటికి సత్తువనిచ్చేవి. ఇది ఒకప్పటి మాట కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఆధునిక వైద్యులు, ఆహార నిపుణులు కూడా ఆవిరితో తయారు చేసుకున్న ఆహార పదార్థాలనే తినమని సూచిస్తున్నారు చాలామందికి. ఎందుకో ఏమిటో తెలుసుకుందాం. ఇడ్లీలు ఆవిరితోనే తయారవుతాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఆవిరితో ఇడ్లీలతోపాటు ఎన్నో రకాల వంటకాలను తయారుచేసుకోవచ్చు. ఎందుకంటే ఆవిరితో వండిన వంటలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. తొందరగా జీర్ణం అవుతుంది నూనెతో డీప్ ఫ్రై చేయడంతో పోలిస్తే ఆవిరితో వండటం వల్ల వాటిలో ఉండే పోషకాలు ఎక్కడికీ పోవు. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇలాంటి ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఆహారం. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే సాధారణంగా చాలా మంది ఇలాంటి ఆహార పదార్థాలను ఉడకబెట్టి వండుతారు. దీంతో వాటిలో ఉండే పోషకాలు చాలా తగ్గిపోతాయి. శక్తిని మరింత పెంచుతాయి అలా కాకుండా ఆవిరిలో ఉడికించడం వల్ల నియాసిన్, విటమిన్ బి, థయామిన్, విటమిన్ సి వంటివి మన శక్తిని మరింత పెంచుతాయి. ఇవి తిన్నవారికి ఖనిజాలు, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, జింక్ వంటిపోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్ సాధారణంగా ప్రతి వంటకు నూనెను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. కానీ ఆవిరితో తయారుచేసే ఆహారాలకు నూనె అవసరమే లేదు. అందుకే ఆవిరి పట్టిన ఆహారాల్లో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఫుడ్ అని నిపుణులు చెబుతున్నారు. ఆవిరితో వండిన ఆహార పదార్థాలలో కేలరీలు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి చాలా తొందరగా జీర్ణం అవుతాయి. ఈ ఆహారం బరువుతోపాటు ఎన్నోరకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. కూరగాయలు, పండ్లు తేలికగా జీర్ణం అవుతాయి. ఆవిరిలో వండిన ఆహారాలు చాలా మృదువుగా తయారవుతాయి. ఆవిరి పట్టిన ఆహారం చాలా తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది! ఆవిరిలో ఉడికించిన ఆహారం కొవ్వులను నియంత్రణలో ఉంచుతుంది. ఎందుకంటే ఈ వంటలో నూనెను ఉపయోగించకపోవడమే దీనికి కారణం. వంటల్లో నూనెవల్లే చాలా బరువు పెరుగుతారు. అందుకే ఎక్కువ కొవ్వు లేదా నూనెను తినకూడదు. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. రంగు, రుచి మారదు ఆవిరితో వండిన కూరగాయల రంగు అస్సలు మారదు. రుచి కూడా బాగుంటుంది. మరింత రుచికరంగా కొన్ని రకాల మసాలా దినుసులను ఉపయోగించవచ్చు. కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే ఆవిరి మీద తయారు చేసే ఆహార పదార్థాలేమిటో తెలుసుకుని వాటి మీద దృష్టి పెట్టాల్సిందే మరి! చదవండి: Health Tips: షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు అస్సలు మంచివి కావు! వీటిని తింటే.. Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
గోధూమ్‌ధామ్
గోధుమపిండి... ఏముందిలే... చపాతీ, పూరీలేగా చేసేది అని చప్పరించేయకండి. అదే పిండికి కొన్ని ఆధరువులు తగిలిస్తే... చపాతీ, పూరీలు సైతం చవులూరించే కొత్త రుచులకు కేంద్రమవుతాయి. గోధుమపిండితోనే స్వీటు, దోసెల లాంటి వెరైటీలూ ఉన్నాయండోయ్! అందుకే, గోధుమలతో ధూమ్‌ధామ్... ఈ ఆదివారం మీ ఫ్యామిలీలో... బంగాళదుంప - కొత్తిమీర చపాతీ కావలసినవి: గోధుమ పిండి - 2 కప్పులు; బంగాళదుంపలు - 8; కొత్తిమీర - ఒక కట్ట, పచ్చి మిర్చి - 4; ఇంగువ - చిటికెడు, ఉప్పు, నెయ్యి - తగినంత తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి. బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి కొత్తిమీర , పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పాత్రలో బంగాళదుంప మిశ్రమం, కొత్తిమీర మిశ్రమం వేసి, ఇంగువ జత చేసి బాగా కలపాలి చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో ఉండను గుండ్రంగా ఒత్తి, అందులో బంగాళదుంప మిశ్రమం ఉంచాలి. అంచులు మూసేసి, పిండి కొద్దిగా అద్దుతూ చపాతీలా ఒత్తాలి స్టౌ మీద పాన్ వేడి చేసి, ఒత్తి ఉంచుకున్న చపాతీని వేసి రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి తీసేయాలి వేడివేడిగా వడ్డించాలి. గోధుమ హల్వా కావలసినవి: గోధుమ పిండి - కప్పు; పంచదార - 2 కప్పులు; మిఠాయి రంగు - చిటికెడు (కొద్దిపాటి నీళ్లలో వేసి కలిపి ఉంచాలి); ఏలకుల పొడి - పావు టీ స్పూను; నెయ్యి - తగినంత తయారీ:ఒక పాత్రలో కప్పుడు నీళ్లు, గోధుమ పిండి వేసి కలపాలి వేరొక పాత్రలో పావు కప్పు నీళ్లు, పంచదార వేసి బాగా కలపాలి. స్టౌ మీద ఈ పాత్ర ఉంచి, పంచదార కరిగేవరకు కలపాలి నీళ్లలో కలిపి ఉంచుకున్న గోధుమపిండి, మిఠాయి రంగు, ఏలకుల పొడి, నెయ్యి వేసి అడుగంటకుండా కలపాలి మిశ్రమం బాగా ఉడికిందనిపించాక, స్టౌ కట్టేయాలి పెద్ద పళ్లానికి నెయ్యి రాసి, ఉడికించుకున్న హల్వా పోసి, సమానంగా పరిచి కట్ చేసుకోవాలి. టొమాటో చీజ్ పూరీ కావలసినవి గోధుమపిండి - కప్పు మైదా పిండి - కప్పు టొమాటో రసం - కప్పుకారం - టీ స్పూను చీజ్ తురుము - కప్పు ఉప్పు - తగినంత నూనె - తగినంత తయారీ ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి, చపాతీ పిండిలా కలిపి సుమారు అర గంటసేపు నాననివ్వాలి.బాణలిలో నూనె వేసి కాచాలి.పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పేపర్ టవల్ మీదకు తీసుకుని, వెజిటబుల్ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి. కశ్మీరీ చపాతీ కావలసినవి: గోధుమపిండి - కప్పు, సోంపు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను, వాము - పావు టీ స్పూను; మిరియాలు - 10, ఇంగువ - పావు టీ స్పూను; పాలు - తగినన్ని, ఉప్పు - తగినంత; నెయ్యి - కొద్దిగా తయారీ: ముందుగా బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలను నూనె లేకుండా వేయించి, చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఒక పాత్రలో గోధుమపిండి, పొడి చేసి ఉంచుకున్న మసాలా, ఇంగువ, పాలు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తి, పెనం మీద వేసి రెండువైపులా నేతితో కాల్చి తీయాలి. వేడివేడిగా ఏదైనా కూరతో అందించాలి.