Stock Award
-
సీఈవోకే షాక్ ఇచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీ.. రూ.1000 కోట్లు క్యాన్సిల్!
దేశీయ సాఫ్ట్వేర్ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ దాని సీఈవోకే షాక్ ఇచ్చింది. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్-యాజ్-ఎ-సర్వీస్ కంపెనీగా సేవలందిస్తున్న ఫ్రెష్‌వర్క్స్ డైరెక్టర్ల బోర్డు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన గిరీష్ మాతృబూతంకు 2022లో కేటాయించిన ఆరు మిలియన్ స్టాక్ యూనిట్ల పనితీరు అవార్డును రద్దు చేసింది. ఈ మేరకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. కఠినమైన స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పనితీరు లక్ష్యాలలో చేసిన మార్పులే సీఈవో పనితీరు అవార్డును రద్దు చేయడానికి కారణంగా నాస్డాక్-లిస్టెడ్ కంపెనీ అయిన ఫ్రెష్‌వర్క్స్ పేర్కొంది. అయితే 19 మిలియన్ల డాలర్ల (రూ.157 కోట్లు) విలువతో కొత్త వార్షిక దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక అవార్డుకు సీఈవో గిరీష్ మాతృభూతం అర్హులవుతారని కంపెనీ తెలిపింది. “సీఈవో మాతృభూతం పర్ఫామెన్స్ బేస్డ్ రిస్ట్రిక్టివ్ స్టాక్ యూనిట్స్ అవార్డును రద్దు చేసి 2024లో ఆయనకి వార్షిక దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక అవార్డును అందించాలని నిర్ణయించడంతోపాటు దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని పెట్టుబడిగా పరిగణించేందుకు కంపెనీ స్టాక్‌హోల్డర్ల అభిప్రాయాలను తీసుకున్నాం" అని ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. 2023కి ఫ్రెష్‌వర్క్స్ మొత్తం స్టాక్ ఆధారిత పరిహారం ఖర్చు 212 మిలియన్ డాలర్లు. 2021లో కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ను ప్రారంభించింది. కంపెనీ బోర్డు 6 మిలియన్ స్టాక్ యూనిట్లను ఈసీవో మాతృభూతమ్కు బహుళ-సంవత్సరాల పనితీరు-ఆధారిత పరిమిత స్టాక్ యూనిట్ అవార్డుగా మంజూరు చేసింది. సీఈవో పనితీరు అవార్డు మొత్తం విలువ 131 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు). -
సుందర్ పిచాయ్ వార్షిక వేతనం ఎంతో తెలుసా
అల్ఫాబెట్ కొత్త సీఈవో సుందర్ పిచాయ్ మరో అద్భుతమైన ఘనతను దక్కించుకున్నారు. అత్యంత శక్తిమంతమైన సాంకేతిక దిగ్గజాల్లో ఒకరుగా నిలిచిన పిచాయ్ ఇపుడు అతిపెద్ద స్టాక్ అవార్డును పొందనున్నారు. రాబోయే మూడేళ్ళలో పనితీరు-ఆధారిత స్టాక్ అవార్డు రూపంలో 240 మిలియన్ డాలర్లు (సుమారు రూ.17వందల కోట్ల) అందుకుంటారు. అలాగే 2020 నుండి పిచాయ్ అందుకోనున్న (టేక్ హోం) వార్షిక వేతనం 20 లక్షల డాలర్లు. ఈ మేరకు అల్ఫాబెట్ శుక్రవారం అందించిన రెగ్యులేటరీ ఫైలింగులో తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న కార్పొరేట్ సీఈవోలలో సుందర్ పిచాయ్ ఒకరు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ అందుకున్న వార్షిక వేతనం 1300 కోట్ల రూపాయలు. 2015లో గూగుల్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, పిచాయ్ వార్షిక వేతనం 652,500 డాలర్లు. మరుసటి సంవత్సరం అతని ఆదాయాలు ఆకాశాన్నంటింది. ముఖ్యంగా 199 మిలియన్ల డాలర్ల భారీ స్టాక్ అవార్డును గూగుల్ సంస్థ అందించింది. కాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు అద్భుత అవకాశం దక్కిన విషయం తెలిసిందే. గూగుల్ మాతృసంస్థ , ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు సంస్థను స్థాపించిన 21 ఏళ్ల తరువాత రిటైర్మెంట్ తీసుకుంటున్న కారణంగా అల్ఫాబెట్‌కు సీఈవోగా పిచాయ్ ఎంపికయ్యారు. దీంతో సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పోరేట్‌గా దిగ్గజంగా అవతరించారు. ఈక్విలార్ ప్రకారం అమెరికాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన మిడియాన్ సీఈఓ మూలవేతనం 1.2 మిలియన్ల డాలర్లు. -
పిచాయ్‌కు రూ.1291 కోట్లు
హూస్టన్: గూగుల్ సీఈవో, భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ గతేడాది ప్రతిఫలంగా (స్టాక్ అవార్డు) కంపెనీ నుంచి భారీ మొత్తం అందుకున్నారు. 2016 సంవత్సరానికి దాదాపు 198.7 మిలియన్ డాలర్లను(దాదాపు రూ. 1291 కోట్లు) పిచాయ్‌కు గూగుల్ అందజేసింది. 2015తో పోలిస్తే ఇది రెండింతలు కావడం గమనార్హం. 2015లో పిచాయ్‌కు దక్కిన స్టాక్ అవార్డు మొత్తం 99.8 మిలియన్ డాలర్లు (రూ. 648 కోట్లు). స్టాక్ అవార్డుతో పాటు 2016లో వేతనంగా 6.5 లక్షల డాలర్లు(4.22 కోట్లు)అందుకున్నారు. అయితే 2015లో పిచాయ్ వేతనం 6.52 లక్షల డాలర్లు. ఆగస్టు 2015లో సీఈవోగా సుందర్ పిచాయ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం గూగుల్ భారీ లాభాలను ఆర్జించింది. ప్రకటనల విభాగం, యూట్యూబ్ బిజినెస్‌లు బాగా పెరిగాయి. అలాగే మెషీన్ లెర్నింగ్, హార్డ్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2016లో గూగుల్ నుంచి స్మార్ట్‌ఫోన్ కూడా విడుదలైంది.