శిఖరంపై చిన్నారి
పన్నెండేళ్ల ప్రాయుంలో... 20,080 అడుగుల ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించి అబ్బురపరచింది హైదరాబాద్ చిన్నారి జాహ్నవి. లడఖ్‌లోని స్టాక్‌ఖంద్రి శిఖరంపైకి ఎక్కి రికార్డు సృష్టించింది. అల్వాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో జాహ్నవి తండ్రి డాక్టర్ కృష్ణారావు వివరాలు వెల్లడించారు.
‘లడఖ్‌లో ఈ నెల 13న జాహ్నవి ట్రెక్కింగ్ ప్రారంభించింది. 14 అర్ధరాత్రి స్టాక్‌ఖంద్రి శిఖరాన్ని అధిరోహించింది. 20,080 అడుగుల ఎత్తులో ఉంటుందా శిఖరం. అక్కడ జాతీయు పతాకాన్ని ఎగురవేసింది. ఇప్పటి వరకు జాహ్నవి 5 జాతీయు, 25 స్థానిక శిఖరాలను అధిరోహించింది. ప్రపంచంలోని ఏడు ఎత్తరుున శిఖరాలపై తన వుుద్ర వేయూలనేది ఆమె లక్ష్యం. త్వరలో దక్షిణాఫ్రికాలోని కిలువుంజారో అధిరోహించేందుకు సన్నద్ధవువుతోంది’ అని కృష్ణారావు చెప్పారు. వూనసిక వైద్యుడైన కృష్ణారావుకు కూడా ట్రెక్కింగ్‌లో అనుభవం ఉంది. దీంతో చిన్ననాటి నుంచే జాహ్నవికి ఇందులో శిక్షణ ఇచ్చారు. అల్వాల్‌లో నివాసవుుండే జాహ్నవి ప్రస్తుతం సెరుుంట్ మైకేల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.