stocks investment
-
ఇన్వెస్టర్లు పోటీపడుతున్నారు, హాట్ కేకుల్లా ఐపీవో సబ్స్క్రిప్షన్లు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవోలు) జోరు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం నుంచి (ఈ నెల 4న) విండ్లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్, కృష్ణా డయోగ్నస్టిక్స్, దేవయాని ఇంటర్నేషనల్ ఐపీవోలు మొదలయ్యాయి. తొలిరోజే వీటికి పెద్ద ఎత్తున బిడ్లు దాఖలయ్యాయి. గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల నుంచి పూర్తి చందాలు (సబ్స్క్రయిబ్) వచ్చాయి. దేవయాని ఇంటర్నేషనల్ కేఎఫ్‌సీ, పిజ్జాహట్, కోస్టాకాఫీ బ్రాండ్ల ఉత్పత్తులను విక్రయించే దేవయాని ఇంటర్నేషనల్ ఇష్యూకు తొలిరోజు 30,26,56,860 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. కంపెనీ ఆఫర్ చేస్తున్న 11,25,69,719 షేర్లతో పోలిస్తే 2.7 రెట్లు అధికంగా బిడ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.86–90 ధరల శ్రేణితో దేవయాని ఇంటర్నేషనల్ ఆఫర్ చేస్తోంది. 10 శాతం షేర్లను రిటైలర్లకు కేటాయించగా.. వారి నుంచి 11.37 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగుల కోట కూడా పూర్తిగా సబ్స్క్రయిబ్ అయింది. కృష్ణా డయోగ్నస్టిక్స్ డయోగ్నస్టిక్స్(వ్యాధి నిర్ధారణ) సేవలు అందించే కృష్ణా డయోగ్నస్టిక్స్ రూ.1,213 కోట్ల సమీకరణకు ఐపీవోను చేపట్టగా.. తొలిరోజే పూర్తి స్థాయి స్పందన అందుకుంది. 71,12,099 షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తుండగా.. 1,41,10,650 షేర్లకు బిడ్లు వచ్చాయి. అంటే రెండు రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. ముఖ్యంగా రిటైలర్ల కోటా 9.59 రెట్లు అధికంగా బిడ్లు అందుకుంది. ఈ సంస్థ ఒక్కో షేరు ను రూ.933–954 ధరల శ్రేణిపై ఆఫర్ చేస్తోంది. ఎక్సారోటైల్స్ టైల్స్ తయారీలోని ఎక్సారోటైల్స్ ఐపీవోలో భాగంగా 1,14,50,675 షేర్లను ఆఫర్ చేస్తుంటే.. తొలి రోజే 4.67 రెట్ల అధిక స్పందన అందుకుంది. మొత్తం 5,35,23,750 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైలర్ల కోటాలో 9.29 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. విండ్లాస్ బయోటెక్ ఈ ఔషధ తయారీ సంస్థ ఐపీవోలో భాగంగా 61,10,317 షేర్లను ఆఫర్ చేస్తోంది. మొదటి రోజే మూడు రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రిటైలర్ల కోటాలో 6 రెట్లు అధికంగా స్పందన వచ్చింది. -
ఫైనాన్షియల్ బేసిక్స్..
స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.. వృద్ధి రేటు: స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముందుగా కంపెనీ గురించి తెలుసుకోవాలి. దాని వ్యాపారం ఎలా ఉందో గమనించాలి. అంటే కంపెనీ మంచి పనితీరు కనబరుస్తోందా? లేదా? వృద్ధి రేటు ఏ స్థాయిలో నమోదవుతోంది.. వంటివి చూడాలి. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు, విస్తరణ తదితర అంశాలను కూడా చూడాలి. లాభదాయకత: కంపెనీ ట్రాక్ రికార్డు బాగుండాలి. దాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు చదవాలి. అది స్థిరమైన వృద్ధిని నమోదుచేస్తూ ఉండాలి. అలాగే దాని మార్జిన్లు కూడా బాగుండాలి. డివిడెండ్లపై ప్రత్యేకంగా కన్నేయాలి. షేర్ ధర క్రమంగా పెరుగుతూ వచ్చి ఉండాలి. ఇలా ఉన్న కంపెనీ షేర్లపై ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్యాలెన్స్ షీట్: కంపెనీ బ్యాలెన్స్ షీట్ బాగుండాలి. దాని కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూడాలి. అంటే ఆ కంపెనీ రుణాలతో నడుస్తోందా? లేదా సరిపడినంత క్యాష్ ఫ్లో ఉందా? అనే అంశాలను గమనించాలి. కంపెనీ నిర్వహణ వ్యయం స్థిరంగా ఉందో.. పెరుగుతోందో చూడాలి. అమ్మకాలు పెరగకుండా.. వ్యయాలు మాత్రం పెరుగుతూ ఉంటే అప్రమత్తంగా ఉండాలి. మేనేజ్మెంట్: కంపెనీ మేనేజ్మెంట్ గురించి ప్రత్యేకం గా మాట్లాడుకోవాలి. కంపెనీ చైర్మన్, డైరెక్టర్ల వివరాలు, వారి విద్యార్హతలు, ఇదివరకు పనితీరు, వేతనాలు వంటి పలు విషయాలను సవివరంగా తెలుసుకోవాలి. కంపెనీ మేనేజ్మెంట్ సుదీర్ఘకాలం నుంచి స్థిరంగా ఉందా? లేక దానిలో పలుమార్లు మార్పులు చోటుచేసుకుంటున్నాయా? అనే అంశాలపై కన్నేయాలి. రిస్క్‌లు: కంపెనీ పనితీరును, భవిష్యత్ వృద్ధిని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉన్నాయేమో ముందే ఊహించాలి. కంపెనీ వార్షిక నివేదిక, మేనేజ్మెంట్ నిర్ణయాలు వంటి వాటి ఆధారంగా ప్రమాదాలను ముందే పసిగట్టొచ్చు. కంపెనీ ఏ రంగంలో ఉందో చూడాలి. ఆ రంగం భవిష్యత్ అంచనాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇలా అన్ని అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతే నచ్చిన, అనువైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి.