జూబ్లీహిల్స్‌లో పబ్‌పై పోలీసుల దాడి
హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌పై శనివారం అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని స్టోన్ వాటర్ కిచెన్ లాంజ్ పబ్‌పై పోలీసులు దాడి చేసి... యజమాని ధీరజ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆర్థరాత్రి దాటిన తర్వాత పబ్ తెరచి ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడితో పబ్‌లోని యువతి యువకులు అక్కడి నుంచి జారుకున్నారు.