ఆఫర్లన్నీ ఒకేచోట!
స్టోర్స్‌ఎన్‌ఆఫర్స్.కామ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షాపింగ్ అంటే ఎవరికై నా ఇష్టమే. ఆఫర్లుంటే ఉత్సాహం పెరుగుతుంది. మరి ఎక్కడెక్కడ ఏ ఆఫర్లున్నాయో తెలుసుకోవటమెలా? ‘స్టోర్స్‌ఎన్‌ఆఫర్స్.కామ్’ చూస్తే చాలు. ఇది హైదరాబాద్‌లో ఏ షాపుల్లో ఆఫర్లు, బంపర్ సేల్స్ ఉన్నాయో మన ముందుంచుతుంది. దీనిపై మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ జే రవితేజ మాటల్లోనే...
⇔ అన్ని సంస్థలూ పత్రికలు, టీవీలు, హోర్డింగ్సలలో ప్రకటనలివ్వలేవు. ఇచ్చినా అవి కస్టమర్లకు చేరుతాయని గ్యారంటీ లేదు. ఈ గ్యాప్‌ను నింపటమే స్టోర్స్‌ఎన్‌ఆఫర్స్.కామ్ పని. అంటే దుకాణాదారులు, కొనుగోలుదారులను కలుపుతుందన్న మాట. స్థానికంగా ఏ దుకాణాల్లో ఎలాంటి ఆఫర్లున్నాయో చెబుతూ కస్టమర్ల డబ్బును ఆదా చేస్తుంది.
⇔ జె.పూజ, పవన్ కుమార్ మారెంతో కలిసి రూ.10 లక్షలతో 2016 జూన్‌లో ఆరంభించాం.
⇔ విక్రయదారులు తమ ఉత్పత్తులను, మా సైట్ ద్వారా ఉచితంగా ప్రచారం చేసుకోవచ్చు. ఆఫర్లుంటే వాటిని ప్రత్యేకంగా ప్రదర్శించుకోవచ్చు. కస్టమర్ తనకు కావాల్సిన విభాగాన్ని నమోదు చేయగానే దాని తాలుకు ఆఫర్లు ఏ ఏ దుకాణాలు అందిస్తున్నాయో చిరునామా, ఫోన్ నంబర్లతో సహా అందిస్తాం. ఇక నేరుగా కస్టమరే షాపుకు వెళ్లి కొనుక్కోవచ్చు. ప్రతి ఉత్పత్తి కొనుగోలుపై స్టోర్ నుంచి 10-15% కమీషన్ రూపంలో తీసుకుంటాం.
⇔ దుస్తులు, ఫర్నిచర్, ఫుడ్, రెస్టారెంట్స్, స్పా, సెలూన్, ఫిట్నెస్, గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్ వంటి 9 విభాగాల్లో 1,000కి పైగా ఆఫర్లున్నారుు. 2 వేల స్టోర్లు నమోదయ్యారుు. జనవరిలో ఆండ్రారుుడ్, ఫిబ్రవరిలో ఐఓఎస్ యాప్స్‌ను తెస్తాం.
⇔ 5 వేల మంది కస్టమర్లున్నారు. నెలకు లక్ష పేజీ వ్యూలొస్తున్నారుు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే సేవలందిస్తున్నాం. 2017లో నిధుల సమీకరణ పూర్తి చేసి బెంగళూరు, ముంబైలకు విస్తరిస్తాం.