తియ్య తియ్యగా...
నెయిల్ ఆర్ట్
ఇది స్ట్రాబెర్రీ నెయిల్ ఆర్ట్... చూడగానే అందరికీ నోరూరించే పండ్లు - స్ట్రాబెర్రీలు.. ఇకపై మీ గోళ్లనే వాటిలా చేసుకోవాలనుకుంటే ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోండి. పూలను మాత్రమే కాకుండా ఈసారి పండ్ల డిజైన్స్‌నూ నేర్చుకుందాం. ఈ డిజైన్ కోసం లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ ఎల్లో, ఎరుపు రంగుల నెయిల్ పాలిష్‌లు ఉంటే చాలు. పెద్దలే కాదు.. చిన్నపిల్లలకూ ఈ స్ట్రాబెర్రీ నెయిల్ ఆర్ట్‌ను వేస్తే.. వాళ్లు భలే థ్రిల్లింగ్‌గా ఫీలవుతారు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే డిజైన్‌ను ట్రై చేయండి.. ఎలా అంటే.
1. ముందుగా గోళ్లను శుభ్రం చేసుకొని, అందంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కోగోరుపై ఎరుపు రంగు నెయిల్ పాలిష్‌ను పూర్తిగా పూయాలి.
2. ఆ పాలిష్ ఆరిన తర్వాత ఎల్లో కలర్ పాలిష్‌లో టూత్ పిక్‌ను ముంచి ఫొటోలో కనిపిస్తున్న విధంగా చుక్కలు పెట్టుకోవాలి.
3. తర్వాత గోరు అడుగు భాగంలో డార్క్ గ్రీన్ పాలిష్‌తో ఆకులు గీసుకోవాలి.
4. రంగు పూర్తిగా ఆరిన తర్వాత లైట్ గ్రీన్ నెయిల్ పాలిష్‌తో ఆకుల డిజైన్‌కు బార్డర్స్ గీయాలి. అలా చేస్తే నిజమైన ఆకుల్లా కనిపిస్తాయి. అంతే, ఎంతో అందమైన స్ట్రాబెర్రీలు మీ చేతి సొంతం.