2 వరకు తానా ‘చైతన్య స్రవంతి’
తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని
విజయవాడ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ‘చైతన్య స్రవంతి’ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తెలిపారు. విజయవాడలోని ఆంధ్రా చాంబర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి జనవరి రెండో తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీన్లో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా చిలువూరులో మెగా హెల్త్క్యాంప్ నిర్వహించామన్నారు.
గురువారం హైదరాబాద్లోని బషీర్బాగ్ భారతీయ విద్యాభవన్లో జరిగే కార్యక్రమంలో లిటిల్ మ్యుజీషియన్ అకాడమీకి రూ.45 లక్షల సాయం అందించనున్నట్లు చెప్పారు. తెలంగాణ రచయితలు, నటులను సత్కరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తానా కార్యదర్శి సతీష్ వేమన, బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ చైర్మన్ డాక్టర్ నరేన్ కొడాలి, ఆంధ్రా చాంబర్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ పాల్గొన్నారు.