మృతదేహంతో ధర్నా
అనంతపురం సెంట్రల్ : రుద్రంపేటలో శనివారం సాయంత్రం మృతదేహంతో ఓ దుకాణం ఎదుట ధర్నా నిర్వహించా రు. రుద్రంపేట పంచాయతీలోని చంద్రబాబునాయుడు కొట్టాలకు చెందిన లక్ష్మి(50) కూలి పనులకు వెళ్లి చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామ సమీపం లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన విషయం తెలిసిందే. ధ ర్మవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులు తిరు గు ప్రయాణమయ్యారు.
అయితే కూలి ప నులకు పిలుచుకుపోయిన వ్యక్తి మహిళ మృతి చెందినా పట్టించుకోలేదు. దీంతో తోటికూలీలు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చె ల్లించాలని డిమాండ్ చేస్తూ రుద్రంపేట కూడలిలో ఆ వాహన యజమాని దుకా ణం ఎదుట ధర్నా నిర్వహించారు. విష యం తెలుసుకున్న నాల్గవ పట్టణ ఎస్ఐ శ్రీరామ్ ఘటనస్థలికి చేరుకున్నారు. మృ తదేహంతో ధర్నా చేయడం పద్ధతి కాదన్నారు. వెంటనే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని, తర్వాత మీకు న్యాయం జరిగేలా నేను చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన నిర్వహించారు. అనంతరం వాహన యజమానిని స్టేషన్కు పిలిపించుకుని మందలించారు.