Strong police security
-
కలెక్టర్ల సదస్సుకు పటిష్ట బందోబస్తు
గుంటూరు: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద గ్రీవెన్స్ భవన్లో మంగళవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైన దృష్ట్య పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బధవారం వరకు కొనసాగే సదస్సుకు ముందురోజు నుంచే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను అదనంగా మొహరించారు. పరిసర ప్రాంతాలతో పాటు సమీపంగా ఉన్న పొలాల్లో సైతం బలగాలు జల్లెడ పట్టాయి. కరకట్ట పొడవునా పోలీసులను మొహరించారు. ఉండవల్లి ప్రధాన మార్గం వెంట కూడా పోలీసులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం అనుమతులు ఇచ్చారు. ఎలాంటి ఘటన చోటు చేసుకున్నా నిమిషాల్లో చేరుకునేలా మొబైల్ పార్టీలతో పాటు బాండ్ అండ్ డాగ్ స్క్వాడ్లను సిద్ధంగా ఉంచారు. మొత్తం 336 మందిని బందోబస్తుకు కేటాయించారు. బందోబస్తు ఏర్పాట్లను హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప స్వయంగా పరిశీలించి అర్బన్ ఎస్పీ సిహెచ్.విజయారావుకు పలు సూచనలు ఇచ్చారు. హోంమంత్రి ఆదేశాల మేరకు బందోబస్తును మరింత కట్టుదిట్టం చేశారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీలు జి.రామాంజనేయులు, మూర్తి, ప్రసాద్, జి.శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, తదితరలు ఉన్నారు. -
గట్టి పోలీసు బందోబస్తు
అడ్డతీగల (తూర్పుగోదావరి), న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఏలూరు రేంజి డీఐజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరగడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగా మావోయిస్టుల నిరోధక కార్యక్రమాలను ఎప్పటిలాగే అనుభవజ్ఞులైన అధికారులతో కొనసాగిస్తున్నామని వివరించారు. బుధవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల సర్కిల్ పరిధిలోని అడ్డతీగల, గంగవరం పోలీసు స్టేషన్లను సందర్శించారు. పోలీసు సిబ్బంది నివసిస్తున్న క్వార్టర్లు, పోలీసు స్టేషన్ భవనాల స్థితిగతులను పరిశీలించారు. అనంతరం ఏజెన్సీలో భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. శిథిలమైన క్వార్టర్ల స్థానే నూతన భవనాల నిర్మాణానికి నిధులు, ఆదేశాలు ఇవ్వమని డీజీపీ కార్యాలయానికి నివేదించామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా జనమైత్రి సమావేశాలు నిర్వహించడంతో పాటు ఆయా చోట్ల గుర్తించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తిం చాలన్నారు. సాధారణ పర్యటన గానే తాను ఏజెన్సీ ప్రాంతానికి వచ్చానన్నారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) ప్రకాష్ జాదవ్, డీఎస్పీ చైతన్యకుమార్, అడ్డతీగల సీఐ హనుమంతరావు ఉన్నారు.