ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం
సురే్ధపల్లి(నేలకొండపల్లి) : ప్రేమించానన్నాడు... పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. చెట్టాపట్టాలు వేసుకుని తిప్పాడు.. తీరా తనకు సంబంధం లేదని నెట్టేస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. నేలకొండపల్లి మండలంలోని సురే్ధపల్లి గ్రామానికి చెందిన నాగుల్‌మీరా అనే యువతికి అదే గ్రామానికి చెందిన తోళ్ల ఉపేందర్ అనే యువకుడుకి గత ఏడేళ్ల క్రితం ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ఇరువురు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఇటీవల ఇద్దరు బైక్‌పై భద్రాచలం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో నాగుల్‌మీరా గాయపడింది. అప్పట్లో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొమ్మని అడుగగా తాను చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో సదరు యువతి తనకు న్యాయం చేయాలని ఆదివారం ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటంకు ది గింది. తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పింది. విషయం తెలుసుకుని స్థానిక పోలీ సులు సంఘటనా స్థలంకు చేరుకుని బాధితురాలితో పాటు అబ్బాయి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.