అపార్ట్మెంట్పై నుంచి పడి ఎంబీఏ విద్యార్థి మృతి
హైదరాబాద్: అపార్ట్మెంట్ పై నుంచి పడి ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్లో వెలుగుచూసింది. స్థానిక స్టైల్ హోం అపార్ట్మెంట్పై నుంచి పడి ఓ ఎంబీఏ విద్యార్థి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మృతుడు ఢిల్లీకి చెందిన మొహక్గా గుర్తించారు. ఇతను తార్నాకలోని నర్సిమోంజి కళాశాలలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. ప్రమాదవశాత్తుపై నుంచి పడ్డాడా.. లేక ఎవరైనా కావాలనే తోసేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.