డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి
నల్లగొండ టుటౌన్: డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరుతూ అఖిలపక్ష జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో వివిధ పత్రికల సబ్ ఎడిటర్లు శుక్రవారం కలెక్టర్ టి.చిరంజీవులుకు వినతిపత్రం అందజేశారు. డెస్క్ లో పని చేసే జర్నలిస్టులందరినీ వర్కింగ్ జర్నలిస్టులుగా పరిగణించి అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా అక్రిడిటేషన్ కమిటీలో డెస్క్ జర్నలిస్టు ప్రతి నిధికి అవకాశం కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు దూసరి కిరణ్‌గౌడ్, టీయూడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేకల కృష్ణయ్య, వివిధ పత్రికల బ్యూరో ఇన్‌చార్జ్‌లు మారబోయిన మధుసూదన్, మేకల కళ్యాణ్ చక్రవర్తి, జూలకంటి రాజేందర్‌రెడ్డి, ఎడిషన్ ఇన్‌చార్జ్‌లు టి.జాన్‌రెడ్డి, నాగేశ్వర్రావు, నరేం దర్, శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్‌రెడ్డి, నన్నూరి వెంకటరమణారెడ్డి, సబ్ ఎడిటర్లు పాల్గొన్నారు.