కదులుతున్న రైళ్లోనుంచి తోసేశారు
మహబూబాబాద్:
కదులుతున్న రైళ్లో నుంచి తోసేయడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్‌లో శనివారం వెలుగు చూసింది. త్రిపురకి చెందిన సుభుకలోజ్ అనే వ్యక్తి త్రిపుర నుంచి గోహాటి ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా.. గుర్తుతెలియని దుండగులు రైళ్లో నుంచి తోసేశారు.
దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు.