అమరుల త్యాగఫలమే తెలంగాణ
అంబరాన్నంటేలా రాష్ట్ర అవతరణ వేడుకలు
జూన్ 1 అర్ధరాత్రి అమరుల కీర్తి స్థూపం ఆవిష్కరణ
అమరుల కుటుంబాలకు సన్మానం
జిల్లా కలెక్టర్ జి.కిషన్ వెల్లడి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో సుమారు 12వందల మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వారి త్యాగఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో అవతరణ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఓరుగల్లు సేవా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్, జిల్లా కలెక్టర్ జి.కిషన్ చెప్పారు. కలెక్టర్ నివాసం ఎదుట, ఆర్ట్స్ కళాశాలలో చేపడుతున్న తెలంగాణ అమరవీరుల స్థూపం పను లను ట్రస్ట్ సభ్యలతో కలిసి బుధవారం పరిశీ లించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేడుకల ఏర్పాట్లను వివరించారు. అమరుల త్యాగానికి గుర్తుగా అమరవీరుల కీర్తి స్థూపం ఆవిష్కరిస్తున్నామని, అనంతరం వారి కుటుంబ సభ్యులను సత్కరించనున్నామని చెప్పారు. జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి 12.01 నిమిషానికి సూపం ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. అదే విధంగా జూన్ 2న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
1న అర్ధరాత్రి క్యాండిల్ ర్యాలీ
జూన్ 1న అర్ధరాత్రి 12 గంటలకు కీర్తి స్థూపం వద్దకు చేరుకునే విధంగా.. కాళోజి జంక్షన్‌నుంచి, ఎన్ఐటీ నుంచి రెండు బృందాలు కొవ్వత్తులతో ప్రదర్శనగా వస్తాయని, సూప్కం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి.. ఆవిష్కరణ కార్యక్రమం చేపడతామని తెలిపారు. అమరుల త్యాగాలు అనుక్షణం గుర్తిస్తూ వారి ఆశయ సాధనకు పాటు పడేలా కీర్తి స్థూపం వద్ద ప్రతిజ్ఞ చేయిస్తామని, లెంగాణ సంసృ్కతి ఉట్టిపడేలా బతుకమ్మ, బోనాలు, చిందుయక్షగానం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు పరంగా ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి కృషిచేయాలి
సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థా యిలో అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ కిషన్ పిలుపునిచ్చారు. తెలంగాణ పు నర్నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. రాష్ట్రా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లినప్పుడే అమరులకు నిజమైన నివాళి అర్పించినట్లన్నారు.
32 అడుగుల స్థూపం
తెలంగాణలో తొలిసారిగా 32 అడుగుల ఎత్తు, 60 టన్నుల బరువు ఉన్న స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దీని తయారీకి స్థపతి శివకుమార్ నేతృత్వంలో 16మంది శిల్పులు 20రోజులుగా శ్రమిస్తున్నారని చెప్పారు. అన్ని శాఖల భాగస్వామ్యంతో పనులు సాగుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ ముద్దుబిడ్డ కలెక్టర్ : పరిటాల సుబ్బారావు
తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కలెక్టర్ కిషన్ జిల్లాలో ఉన్నందువల్లే ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టగలుగుతున్నామని, అమరుల కీర్తి స్థూపం ఏర్పాటులో కలెక్టర్ చొరవ, అంకితభావం మరువలేదనిదని ట్రస్ట్ కన్వీనర్ పరిటాల సుబ్బారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా వరంగల్ జిల్లాలో మాత్రమే ఈ విధమైన కార్యక్రమం చేపడుతున్న ఘనత కలెక్టర్‌కు దక్కుతుందన్నారు.
ట్రస్ట్‌కు ఉద్యోగుల సగం రోజు వేతనం రూ.30 లక్షలకు పైగా త్వరలో అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, టీఎన్జీవోస్ అధ్యక్షుడు కోలా రాజేష్‌కుమార్, కార్యదర్శి రత్నవీరాచారి, టీజీవోల సంఘం ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రావు, శ్రీనివాస్‌రావు, వీఆర్వోల సంఘం నేతలు దొండపాటి రత్నాకర్‌రెడ్డి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నేత దాస్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.