Subsidized cylinder
-
సబ్సిడీ ఎల్పీజీ ధర రూ.7 పెంపు
-
సబ్సిడీ ఎల్పీజీ ధర రూ.7 పెంపు
న్యూఢిల్లీ: సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర శుక్రవారం రూ.7కు పైగా పెరిగింది. వచ్చే మార్చి నాటికి సబ్సిడీలను పూర్తిగా ఎత్తేయడానికి ఎల్పీజీ ధరలను ప్రతినెలా పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ ధర రూ.479.77 నుంచి రూ.487.18కి చేరింది. ఇక సబ్సిడీయేతర సిలిండర్ ధర కూడా రూ.73.5 పెరిగి రూ.597.50కి చేరుకుంది. విమానాల్లో ఇంధనంగా వినియోగించే ఏటీఎఫ్ ధరను కూడా కిలోలీటరుకు రూ. 1,910 పెంచారు. ప్రజా పంపిణీ దుకాణాల ద్వారా అమ్మే కిరోసిన్ ధర లీటర్‌కు 25 పైసలు పెరిగింది. ప్రతినెలా రూ.2 చొప్పున పెంచుతూ గతేడాది జూలైలో ప్రారంభమైన విధానం ద్వారా ఇప్పటి వరకు సబ్సిడీ సిలిండర్ ధర రూ.68 పెరిగింది. తొలుత నెలకు రూ.2 చొప్పున మాత్రమే పెంచాలని ఆదేశించిన కేంద్రం మే 30న దాన్ని రూ.4గా మార్పు చేసింది. -
రూ.2 పెరిగిన వంటగ్యాస్
న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధరను రూ.2 పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతోపాటు విమాన ఇంధనం, కిరోసిన్ ధరలూ పెరిగాయి. సబ్సిడీ సిలిండర్‌పై నెలకు రూ.2 పెంచాలని గత జూలైలో కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారమే సిలిండర్ ధర పెంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. కాగా, సబ్సిడీయేతర సిలిండర్‌కు రూ.1, కిరోసిన్‌పై 26పైసలు పెరిగింది.