'దాదాగిరి పోలీస్'పై కేసు
హైదరాబాద్: రక్షక భటుడే దాదాగిరి చేస్తున్నాడు. అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అనంతపురంలో జరిగిన ఈ పరిణామాలపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
అనంతపురంలో సుధాకర్ నాయుడు అనే కానిస్టేబుల్ అధికార టీడీపీ నేతల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సుధాకర్ నాయుడుపై ఇంకా పలు ఆరోపణలు వచ్చాయి. కానిస్టేబుల్ అక్బర్‌కు చెందిన బైకు దహనం ఘటన వెనుక సుధాకర్ నాయుడి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుధాకర్ నాయుడిపై కేసు నమోదు చేశారు.