సివిల్ ఇంజనీరింగ్ కీలకం
అనంతపురం సిటీ :
సివిల్ ఇంజనీరింగ్ అత్యంత కీలకమైనదని, ఇంజనీర్ చేసిన చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చునని జేఎన్టీయూ రెక్టార్ సుదర్శన్‌రావు అ న్నారు. ఇంజనీర్స్‌డే సందర్భంగా సోమవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహ ఆవరణలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని రెక్టార్ ఆవిష్కరించారు. అ నంతరం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సివిల్ ఇంజనీరింగ్ అతికష్టమైనదని, భవనాలు, ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో కాం క్రీట్ వాడకమే కీలకమన్నారు. బెటర్ సిమెంట్, బెటర్ కాంక్రీట్‌తో సుందరం గా భవనాలు నిర్మించవచ్చునన్నారు. కాంక్రీట్ ఆవిష్కరణలు జరగాలన్నారు. ల్యాబొరేటరీల్లో వాటిని పరీక్షించిన తరువాతే వినియోగించాలన్నారు. జాతీయ రహదారుల సూపరింటెండెంటింగ్ ఇం జనీర్ వైఆర్ సుబ్రహ్మణ్యం, ఆర్ అండ్‌బీ ఎస్ఈ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మైసూరులో అనేక కట్టడాలు నిర్మించారని, అక్కడి ప్రజలు ఆయనకు ఫాదర్ ఆఫ్ నేషన్‌గా బిరుదు ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో హుసేన్‌సాగర్‌ను విశ్వేశ్వరయ్యే నిర్మించారన్నారు. పదవీ విరమణ పొందిన ఇంజినీర్లు మనోహర్, శశిభూషణ్‌రెడ్డి, రమణారెడ్డిలతోపాటు విశ్వేశ్వర్య్య విగ్రహం తయారుచేయించిన ఇం జనీర్ నాగరాజును సన్మానించారు.
బెస్ట్ ఇంజనీర్లకు ప్రశంసాపత్రాలు
బెస్ట్ ఇంజనీర్లుగా ఆర్‌అండ్‌బీలో పనిచేస్తున్న జయరామిరెడ్డి, వెంకటనారాయణ, శ్రీనివాసమూర్తి, విశ్వనాధరెడ్డి, రాజగోపాల్, బీఎస్ఎన్ ప్రసాద్, జయరాజ్, నాగరాజు, శ్రీనివాసులు, సిద్దారెడ్డి, నాగభూషణం, హారిక, రాఘవేందర్రావు, లక్ష్మి, మాలింగప్ప, ఆంజనేయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్ఆర్ఐటీ కళాశాలలో చదువుతూ ప్రతిభ లక్ష్మి కిరణ్మయి, తనూజలకు బెస్ట్ విద్యార్థులుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డికి యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును అందజేసి సన్మానించారు.