‘ఐఏఎస్’ అసోసియేషన్లో సీఎం క్యాంపు ఆఫీస్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రస్తుతం సీఎం అధికార నివాసానికి ఎదురుగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయానికి చేరనుంది. అక్కడ మూడెకరాల స్థలంలో క్యాంపు కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం యోచి స్త్తున్నట్టు సమాచారం. సీఎంకి గ్రీన్ల్యాండ్స్లో ఒక కార్యాలయం ఉన్నప్పటికీ కేసీఆర్ వాస్తుదోషం కారణంతో దానిని వినియోగించడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త కార్యాలయ బిల్డింగ్ క న్సల్టెంట్గా సుద్దాల సుధాకర్ తేజను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆయన ఇప్పటికే సచివాలయం లో వాస్తు అంశాలను పరిశీలించారు.