అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మహబూబ్‌నగర్(అచ్చంపేట): అచ్చంపేట మండలం రంగాపూర్‌లో అప్పులబాధ తట్టుకోలేక కౌకుంట్ల సుదర్శన్ రెడ్డి(45) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో చూసి పొలం వద్ద ఉన్న ఇంట్లో మంగళవారం ఉరేసుకున్నాడు. ఇటీవల వేసిన పత్తి, మొక్కజొన్న పంటల్లో నష్టం రావటంతో మనస్తాపానికి గురయ్యాడని స్థానికులు చెబుతున్నారు. సుమారు రూ.5 లక్షల మేర అప్పులు పేరుకు పోవడంతో గత్యంతరం లేక ఉరేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.