విద్యుదావేశం
15 రోజులుగా వేళాపాళా లేని విద్యుత్ కోతలతో విసిగి వేసారిన చెరకు రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కోత కారణంగా బెల్లం తయారికీ తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులకు ఎన్నో మార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించి విద్యుత్ ఏఈని నిర్బంధించారు. విద్యుత్ ఉపకేంద్రానికి తాళం వేశారు.
మునగపాక, న్యూస్‌లైన్ : మండలంలోని అధికశాతం రైతులు చెరకుపంటను సాగు చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. అయితే గత 15 రోజులుగా వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యు త్ సరఫరాలో తరచూ అంతరాయం కలుగుతోంది. దీంతో పదేపదే అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో అఖి లపక్షం ఆధ్వర్యంలో శనివారం విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. రహదారిపై బైఠాయించారు. ‘కోత’ కష్టాలు గట్టెక్కించాలంటూ సుమారు 3 గంటల పాటు నినాదాలు చేశా రు. వ్యవసాయ రంగానికి ఇచ్చే సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, బెల్లం తయారీకి అవసరమయ్యే విద్యుత్‌ను సకాలంలో సరఫరా చేయాలంటూ డి మాండ్ చేశారు.
చెరకు తోటలకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెడుతున్నామని అయితే రైతాంగానికి ఇచ్చే విద్యుత్ సరఫరాలో అంత రా యం కారణంగా రసం పులిసిపోయి దిగుబడులు తగ్గిపోతున్నాయని సీపీఎం జిల్లా నాయకుడు ఎ. బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిళ్లపాది కష్టపడి పనిచేసినా రైతుకు కష్టాలే తప్ప ఆదుకున్నవారు లేరంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్య పరిష్కారంపై తమకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యుత్ ట్రాన్స్‌కో ఏఈ త్రినాథరావు కలుగజేసుకొని రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆందోళన విరమించాలని కోరారు.
అయితే తమకు ఇప్పటికిపుడే స్పష్టమైన హామీ ఇవ్వాలని లేకుంటే ఆందోళన విరమించబోమని రైతులు ఆయనకు స్పష్టం చేశారు. దీంతో అటు అధికారులు, ఇటు రైతుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. వివాదం పెరగడంతో రైతులు ట్రాన్స్‌కో ఏఈ త్రినాథరావును తోసుకుంటూ కొంతదూరం తీసుకువెళ్లి ఉపకేంద్రంలో నిర్బంధిం చి తలుపులు తాళం వేశారు. సమస్య జటిలంగా మారడంతో అప్రమత్తమైన పోలీసులు అనకాపల్లి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు ఇరువర్గాల వారితో సంప్రదింపులు జరిపారు.
సాధ్యాసాధ్యాలను పరిశీ లించి సోమవారం సమస్య పరిష్కారానికి అవసరమయ్యే చర్యలు చేపడతామని ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల నుంచి హా మీ లభించడంతో ఎట్టకేలకు రైతులు ఆందోళన విరమించారు. కాగా తనను రైతులు అన్యాయంగా నిర్బంధించారని ఏఈ త్రినాథరావు కూడా ట్రాన్స్‌కో ఉన్నతాధికారులకు ఫోన్లో సమాచారం అందించారు.
ఆందోళన కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మళ్ల సంజీవరావు, రైతు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పెంట కోట రమణబాబు, ఆడారి మహేష్, రైతు సంఘమాజీ అధ్యక్షుడు పెంట కోట సత్యనారాయణ, సీపీఎం నాయకుడు ఆళ్ల మహేశ్వరరావు, తెలుగుదేశం నాయకుడు దాడి అప్పలనాయు డు, కాండ్రేగుల జగ్గప్పారావు, నరాలశెట్టి తాతారావు, మళ్ల కృష్ణ, కాండ్రేగుల రామగణేష్, అప్పలనాయుడు , పలు ప్రాంతాల రైతులు పాల్గొన్నారు. ఆందోళన కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు.