sumasri
-
బొండా ఉమపై కేసు ఎందుకు పెట్టరు?
సాక్షి, విజయవాడ: తన కూతురు మరణానికి కారుకులైన తన మాజీ భర్త మాదంశెట్టి శివకుమార్, ఎమ్మెల్యే బొండా ఉమమహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని సుమశ్రీ అనే మహిళ కోరారు. ఈ మేరకు శనివారం సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలిచ్చిన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈనెల 15 వరకు గడువు ఉందని, ఈలోపే కేసు నమోదు చేస్తామని ఆమెకు పోలీసులు హామీయిచ్చారు. మాదంశెట్టి శివ, బొండా ఉమపై రెండేళ్ల క్రితం ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె హైకోర్టు తలుపు తట్టారు. ఈనెల 15లోపు మాదంశెట్టి శివ, బొండా ఉమాపై కేసు నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కాగా, సుమశ్రీ కుమార్తె సాయిశ్రీ 2017లో క్యాన్సర్‌తో చనిపోయింది. పాప చనిపోతే ఆస్తి అంతా తండ్రికి వస్తుందన్న క్రూరమైన ఆలోచనతో శివకుమార్.. సాయిశ్రీకి వైద్యం చేయిందని సుమశ్రీ ఆరోపించారు. (‘నాన్నా! నన్ను బతికించవూ ప్లీజ్!’) -
కూతురి మూగవేదన చూడలేక...
నార్కట్‌పల్లి : పోలియో, మూగవేదనతో కన్న కూతురు పడుతున్న బాధను చూడలేక కూతురిని చంపి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ తల్లి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. మునుగోడు మండల కేంద్రానికి చెందిన నాగరోని వెంకటేశ్వర్లు, కల్పన (అలియాస్) పారిజాత దంపతులకు కుమార్తె సుమశ్రీ (9), ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. సుమశ్రీ పుట్టుకతోనే పోలియో బారిన పడడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అంతే కాకుండా పుట్టు మూగ. ఐదేళ్ల క్రితమే వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కల్పననే వారి ఆలనాపాలన చూస్తోంది. కల్పన మూడేళ్లుగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. సుమశ్రీని బాగు చేయించేందుకు ఆమె ఎన్నో ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేదు. ఇటీవల తిరుపతిలో ఆయుర్వేదిక్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లినా నయం కాదని చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి కల్పన సోమవారం సాయంత్రం కూతురిని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి నార్కట్‌పల్లి మండలం వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న రైలు పట్టాల వద్దకు చేరుకుంది. రాత్రి తొమ్మిది గంటల వరకు ఒక్క రైలు కూడా రాకపోవడంతో బ్లేడుతో కూతురు గొంతు గోసి, ఆపై తాను కూడా చేయి, గొంతు కోసుకుంది. విషయాన్ని తన మామ బక్కయ్యకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. వారు 108 కు సమాచారం ఇవ్వగా వారిద్దరిని కామినేని ఆస్పత్రికి తరలించారు. విషమ పరిస్థితిలో ఉన్న సుమశ్రీని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి కల్పన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
కూతురు గొంతు కోసిన తల్లి
నార్కట్‌పల్లి మండలం గోపాలాయపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కూతురు గొంతు కోసి హతమార్చింది. వివరాలు..మునుగోడు మండలంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న నారగోని కల్పన అలియాస్ పారిజాతకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు పుట్టు మూగ ఆ తర్వాత పోలియో వచ్చింది. భర్త 5 సంవత్సరాల క్రితం చనిపోయాడు. కూతుర్ని డాక్టర్ల వద్ద చూపించినా పోలియో నయం కాలేదు. దీంతో కూతురు తనకు భారమైందని భావించిన కల్పన కూతుర్ని గోపాలాయపల్లి గ్రామంలోని శ్రీవారిజాల వేణుగోపాలస్వామి దేవాలయానికి ఒంటరిగా తీసుకువచ్చింది. అనంతరం కూతుర్ని బ్లేడుతో గొంతుకోసి తానూ గొంతుకోసుకుంది. అంతకు ముందే ఈ విషయాన్ని బంధువులకు తెలిపింది. బంధువులు 108 వాహనాన్ని తీసుకువచ్చి ఇద్దర్ని కామినేని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కూతురు సుమశ్రీ(9)ని హైదరాబాద్‌కు తరలించగా..చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.