ఫిక్కీ అవార్డుకు మెదక్ ఎస్పీ ఎంపిక
సంగారెడ్డి మున్సిపాలిటీ: మెదక్ జిల్లా ఎస్పీ సుమతి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) అవార్డుకు ఎంపికయ్యారు. జిల్లాలో ఆమె బాధ్యతలు చేపట్టాక ఫిర్యాదుల విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జిల్లాలోని 15 పోలీస్ సర్కిళ్లల్లో ‘చేతన’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలు కేసుల పరిష్కారానికి అవకాశం కల్పించారు. మే 5న ఎస్పీకి ఢిల్లీలో అవార్డును అందజేయనున్నారు.