Summer Movies
-
అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?
సమ్మర్ పేరు చెప్పగానే పిల్లలకు సెలవులు గుర్తొస్తాయి. వయసైన పెద్దోళ్లకు టూర్స్ గుర్తొస్తాయి. అదే మూవీ లవర్స్‌కు మాత్రం కొత్త సినిమాలే గుర్తొస్తాయి. ఏ వారం ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా? దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ ఎదురుచూసేవాళ్లు. గత కొన్నేళ్లుగా వేసవికి తెలుగు బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. ఈసారి మాత్రం సందడి, హడావుడి ఏం లేకుండానే గడిచిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకనిర్మాతలు.. సంక్రాంతి, సమ్మర్, దసరా పండగ లాంటి వాటిని టార్గెట్ చేసుకుని మూవీస్ తీస్తుంటారు. ఈసారి సంక్రాంతికి చిరు-బాలయ్య హిట్స్ కొట్టేశారు. మార్చి చివర్లో నాని కూడా హిట్ కొట్టేశాడు. పాన్ ఇండియా చిత్రాలతో పెద్ద హీరోలందరూ బిజీ అయిపోవడంతో వాళ్లెవరివీ ఈసారి సమ్మర్ కు రిలీజ్ కాలేదు. ఇది మీడియం రేంజ్ హీరోలకు వరమైంది. కానీ దాన్ని వాళ్లు సరిగా వినియోగించుకోలేకపోయారు. (ఇదీ చదవండి: ఒక్క యాడ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌కు అన్ని కోట్లా?) ఏప్రిల్ నెలని తీసుకుంటే.. తొలివారంలో రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' మూవీతో థియేటర్లలోకి వచ్చారు. ఈ రెండు కూడా తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని, ప్రేక్షకుల డిసప్పాయింట్ చేశాయి. రెండోవారం సమంత 'శాకుంతలం' వచ్చింది. ట్రైలర్ కాస్త అటుఇటుగా ఉండటంతో అందరూ డౌట్ పడ్డారు. కరెక్ట్ గా అదే జరిగింది. ప్రీమియర్ షోలకే అసలు విషయం తెలిసిపోయింది. సామ్ కెరీర్ లోనే ఘోరమైన ఫ్లాప్ గా ఇది నిలిచింది. మూడో వారం వచ్చిన 'విరూపాక్ష'.. ఎవరూ కనీసం ఎక్స్ పెక్ట్ చేయనంత హిట్ అయిపోయింది. పూర్తిస్థాయి హారర్ కాన్సెప్ట్ కావడం 'విరూపాక్ష'కు చాలా ప్లస్ అయింది. స్టోరీకి సుకుమార్ తనదైన శైలిలో టచ్ ఇచ్చేసరికి.. ఈ సినిమా జనాలకు తెగ నచ్చేసింది. లాంగ్ రన్ లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. చివరి వారంలో వచ్చిన అఖిల్ 'ఏజెంట్'పై రిలీజ్ కి ముందు కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మార్నింగ్ షోకే రిజల్ట్ తేలిపోయింది. బొమ్మ ఫట్ అయిపోయింది. ఇలా ఏప్రిల్ మొత్తమ్మీద టాలీవుడ్ కి ఒక్కటంటే ఒక్కటే హిట్ దక్కింది. (ఇదీ చదవండి: టిఫిన్ సెంటర్‌కు స్టార్ హీరోయిన్.. ఎవరూ గుర్తుపట్టలేదు!) మే నెలని తీసుకుంటే.. తొలివారం గోపీచంద్ 'రామబాణం', అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమాలతో వచ్చారు. వీటిలో 'రామబాణం' ఫట్ మని బుడగలా పేలిపోయింది. 'ఉగ్రం' పర్వాలేదనిపించింది. కానీ పెద్దగా జనాలు తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. రెండో వారం వచ్చిన 'కస్టడీ'పై అక్కినేని ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ చైతూ వాళ్లని పూర్తిగా నిరాశపరిచాడు. నీరసమైన స్టోరీ లైన్ వల్ల చూసిన ప్రతిఒక్కరూ డిసప్పాయింట్ అయ్యారు. ఈ మూవీని ఫ్లాప్ గా డిక్లేర్ చేశారు. మూడో వారంలో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' చాలా అంటే చాలా నిరాశపరిచింది. మే చివరి వారంలో వచ్చిన 'మేమ్ ఫేమస్'కి కూడా సేమ్ రిజల్ట్. ఇలా ఎంతో సందడిగా ఉంటుందనుకున్న సమ్మర్.. ఎప్పుడూ లేనంత నీరసంగా సాగింది. 'బిచ్చగాడు 2' , 2018 లాంటి ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలు.. ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశాయి గానీ మూవీ లవర్స్ ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' పైనే ఉన్నాయి. మరి రామయణం ఆధారంగా తీసిన ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో ఏమో? (ఇదీ చదవండి: సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు: పంచ్ ప్రసాద్) -
సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : సమ్మర్ సినిమాలన్ని వాయిదా
సినిమాలకు బెస్ట్ సీజన్ అంటే నాలుగు... సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి. ఉగాది, క్రిస్మస్లకు కూడా సినిమాలు వస్తుంటాయి. అయితే వసూళ్లకు మొదటి నాలుగు పండగలే ప్రధానం. 2020లో సంక్రాంతి సందడి బాగానే సాగింది. అయితే కరోనా దెబ్బకు సమ్మర్ సంబరం మిస్సయింది. దసరా, దీపావళికి కూడా సినిమా పండగ లేదు. సంవత్సరాంతంలో మెల్లిగా సినిమాల విడుదల ఆరంభమైంది. 2021లో సంక్రాంతి సందర్భంగా వెండితెరకు బోలెడన్ని బొమ్మలు వచ్చాయి. కానీ ఈసారి కూడా సమ్మర్ సంబరం పోయే పోచ్! కరోనా సెకండ్ వేవ్‌తో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. గత సమ్మర్‌కి మార్చి చివర్లో థియేటర్లకు లాక్‌పడింది.. ఈ సమ్మర్ కూడా సందడి మిస్. వేసవి సెలవులంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాసులు కురిపించే రోజులు. పరీక్షలను పూర్తి చేసుకున్న విద్యార్థులు, తమ పిల్లలతో సరదాగా సమయం గడిపేందుకు పెద్దలు ప్రధానంగా ఎంచుకునేది థియేటర్స్‌లో సినిమా చూడడం. అందుకే సంక్రాంతి తర్వాత నిర్మాతలు ఎక్కువగా ఇష్టపడే సీజన్ సమ్మరే. కానీ కరోనా కారణంగా గత ఏడాది సమ్మర్‌కి బాక్సాఫీసు కుదేలయింది. ఈ సమ్మర్‌కి అయినా సినిమాల సందడి ఉంటుందనుకుంటే సెకండ్ వేవ్ కారణంగా ఈసారీ నిరాశే. మార్చి మొదటివారం నుంచి ఏప్రిల్ 9 వరకు థియేటర్స్ వంద శాతం సీటింగ్‌తో నడిచాయి. ఈ సమయంలో ‘వైల్డ్ డాగ్, వకీల్‌సాబ్, రంగ్ దే, జాతిరత్నాలు’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు షెడ్యూల్ అయిన సినిమాల్లో ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ (ఏప్రిల్ 16), నాని ‘టక్ జగదీష్’ (ఏప్రిల్ 23), కంగనా రనౌత్ ‘తలైవి’ (ఏప్రిల్ 23), రానా ‘విరాటపర్వం’ (ఏప్రిల్ 30) ఇప్పటికే అధికారికంగా వాయిదా పడ్డాయి. అలాగే మే నెలలో విడుదలకు షెడ్యూల్ అయిన పెద్ద చిత్రాల్లో చిరంజీవి ‘ఆచార్య’ (మే 13) కూడా వాయిదా పడింది. ఇవే కాదు.. వెంకటేశ్ ‘నారప్ప’ (మే 14), బాలకృష్ణ ‘అఖండ’ (మే 28), రవితేజ ‘ఖిలాడి’ (మే 28) చిత్రాలు విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇలా ఈ సమ్మర్ కూడా వెండితెరపై బొమ్మ పడకుండా ముగిసిపోయేలా ఉంది. వెండితెర వెలవెల చలన చిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది వేసవికి సినిమా పండగ లేకుండాపోయింది. 2020 మార్చి 13న విడుదలైన సినిమాలు ఓ మూడు నాలుగు రోజులు థియేటర్లలో ఉండి ఉంటాయేమో! ఆ తర్వాత కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల సినిమా థియేటర్లకు లాక్ పడింది. 13న ఓ పది చిన్న సినిమాల వరకూ విడుదలయ్యాయి. వాటిలో ‘బగ్గిడి గోపాల్, మద, అర్జున’ వంటి సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత సినిమాల విడుదలకు బ్రేక్ పడటంతో సమ్మర్ సంబరం మిస్సయింది. ఈసారి కూడా అదే జరిగింది. ఏప్రిల్ 2న నాగార్జున ‘వైల్డ్ డాగ్’, 9న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ విడుదలయ్యాయి. ఆ తర్వాత విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ వేసవి కూడా వెండితెర వెలవెలపోవడం సినీప్రియులకు బాధాకరం. నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి.. సినిమాని నమ్ముకున్న అందరికీ బాధాకరమే. ఓటీటీలో సినీ హవా తీసిన సినిమా హార్డ్ డిస్క్లోనే ఉండిపోతే నిర్మాతల హార్ట్ హెవీ అయిపోతుంది. పెరిగే వడ్డీలు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఈ పరిస్థితుల్లో కొందరు చిన్న నిర్మాతలకు ‘ఓటీటీ’ ప్లాట్‌ఫామ్ ఓ ఊరట అయింది. గతేడాది లాక్డౌన్లో నేరుగా ఓటీటీలో విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతారామం’. సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలైంది. అప్పటినుంచి చిన్న, మీడియమ్ బడ్జెట్ చిత్రాలు బోలెడన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలయ్యాయి. వాటిలో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కలర్ ఫొటో’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి చిత్రాలులొచ్చాయి. ఇలా ఆ సమ్మర్ నుంచి ఈ సమ్మర్ వరకూ ఓటీటీలో విడుదలై, ఇంటికే వచ్చిన సినిమాలెన్నో. పరిస్థితులు చూస్తుంటే ఇకముందు కూడా ఓటీటీ హవా కొనసాగేలా ఉంది. స్మాల్.. మీడియమ్‌లు కూడా... వేసవిలో పెద్ద సినిమాలే కాదు..పెద్ద సినిమాల మధ్యలో చిన్న, మీడియమ్ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతాయి. ఆ సినిమాలు కూడా ఈసారి వాయిదా పడ్డాయి. అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’, తేజా సజ్జా ‘ఇష్క్’, శ్రీకాంత్ ‘తెలంగాణ దేవుడు’, సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’ వంటి ఆ జాబితాలో ఉన్నాయి. అయితే ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమైన అనసూయ ‘థ్యాంక్యూ బ్రదర్’ అనూహ్యంగా ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో మే 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోలోగా.. ధైర్యంగా... గతేడాది వేసవి, దసరా, దీపావళి పండగలు సినిమాల సందడి లేకుండా వెళ్లిపోయాయి. సంవత్సరాంతంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు ఆరంభమయ్యాయి. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి. ఆ బాధ్యతను ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ తీసుకుంది. సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా? వసూళ్లు ఏమాత్రం ఉంటాయి? వంటి సందేహాల నడుమ లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి గత మేలో విడుదల కావాల్సింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడి, డిసెంబర్ 25న థియేటర్లకు వచ్చింది. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ వంటి స్టార్స్ కూడా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రేక్షకులను కోరారు. అప్పటినుంచి మెల్లిగా సినీ పరిశ్రమ తేరుకుని, సినిమాల విడుదలకు ముందుకొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి మంచి వసూళ్లతో టాలీవుడ్ కోలుకున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. -
స్టార్ స్టార్ సమ్మర్ స్టార్... ఎవరో?
ఈ సమ్మర్‌కి హిందీ సినీ రంగం కూడా హీటెక్కిపోతోంది. షారుక్ ఖాన్ నుంచి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ దాకా పలువురు సూపర్‌స్టార్స్ ఈ సమ్మర్ సినిమా హంగామాలో ఉన్నారు. ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటివారు బరిలో లేరన్న మాటే కానీ, ఈ సమ్మర్ చాలా హాటే. అలాంటి కొన్ని సమ్మర్ రిలీజ్‌ల కథాకమామిషు... షారుక్ వర్సెస్ షారుక్! ఆర్యన్ ఖన్నా... ఓ సూపర్‌స్టార్. గౌరవ్ ఇంచుమించు అతనిలా ఉండే అభిమాని. అతనంటే ప్రాణం. చిన్నతనం నుంచి ఆర్యన్‌ను పిచ్చిగా ఆరాధించిన గౌరవ్ చివరికి ఉన్మాదిలా మారతాడు. తన అభిమాన హీరో జీవితానికి విలన్‌గా తయారవుతాడు. అప్పటి నుంచి గౌరవ్ వెనక ఆర్యన్ లాంటి సూపర్‌స్టార్ పరిగెత్తక తప్పని పరిస్థితి. అదే ఈ షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’ చిత్రం. ఈ సినిమాలో ఎన్నో విశేషాలున్నాయి. ఇంచుమించు 23 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాలో నె గటివ్ రోల్లో షారుక్ కనిపిస్తున్నారు. ఆయన చాలా కాలం తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా కూడా ఇదే. అందుకే అభిమానులకు ‘ఫ్యాన్’ చాలా స్పెషల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాట ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. విడుదల: ఏప్రిల్ 15 రెబల్ లవ్‌స్టోరీ! సియా... చూడటానికి చాలా క్యూట్ గాళ్. కానీ ఏ మాత్రం తేడా వచ్చినా చితక్కొట్టే టైప్. ఆమె జీవితంలోకి రోనీ ఎంటరవుతాడు. అతను కూడా అంతే. ఇద్దరూ రెబల్ క్యారెక్టర్స్ అన్న మాట. ఇంతలో సియాను ప్రేమించిన మరో వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసి తన నేరసామ్రాజ్యంలో దాచేస్తాడు. క్రిమినల్స్, గ్యాంగ్‌స్టర్స్‌ను దాటి ఆమెను కాపాడాలి. మరి రోనీ ఎలా పోరాడి, ఆమె దక్కించుకున్నాడనేదే ‘బాఘీ’ సినిమా కథ. సబీర్‌ఖాన్ దర్శకత్వంలో టైగర్‌ష్రాఫ్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ‘బాఘీ’ సినిమా ట్రైలర్ ఇప్పటికే యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. తెలుగు సూపర్‌హిట్ మూవీ ‘వర్షం’కి హిందీ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ద్వారా మన తెలుగు హీరో సుధీర్‌బాబు విలన్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టారు. ‘ఆషికి-2’ నుంచి కాస్త సెలైంట్ బ్యూటీగా కనిపించిన శ్రద్ధాకపూర్ బికినీ అందాలు, పోరాటాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. విడుదల: ఏప్రిల్ 29 అజారుద్దీన్ జీవితం టెస్టుల్లో 6216 పరుగులు... వన్డేల్లో 9378 పరుగులు......ఇదంతా భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ట్రాక్ రికార్డ్. కానీ ఒక్క వివాదం అతని జీవితాన్ని తలకిందులు చేయడంతో పాటు భారత క్రికెట్ చరిత్రలో అజారుద్దీన్ కెప్టెన్‌గా అందించిన విజయాలను తుడిచేసింది. అదే మ్యాచ్ ఫిక్సింగ్. అజారుద్దీన్ జీవితంలో జరిగిన ప్రేమకథలతో పాటు మ్యాచ్‌ఫిక్సింగ్‌ను కూడా సినిమాలో చూపించనున్నారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. విడుదల: మే 13 ఐష్ మీదే..అందరి కళ్లు అందాల తార ఐశ్వర్యా రాయ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో చేస్తున్న రెండో చిత్రం ‘సరబ్జిత్’. పాక్ జైల్లో మగ్గిపోయిన భారతీ యుడు సరబ్జిత్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సరబ్జిత్ సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐష్ కనిపించనున్నారు. ‘మేరీకోమ్’ ఫేమ్ ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రణ్‌దీప్ హుడా టైటిల్ రోల్ పోషిస్తుండగా, అతని భార్యగా రిచా చద్దా నటి స్తున్నారు. విడుదల: మే 20 ఆ... ముగ్గురూ! అమితాబ్ బచ్చన్ కోలకతా వీధుల్లో స్కూటర్ మీద చక్కర్లు కొట్టిన దృశ్యాలు ఇప్పుడు ఆన్లైన్లో హాట్ టాపిక్. ‘తీన్’ చిత్రంలోని అమితాబ్ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. కోల్‌కతా నేపథ్యంలో సాగే కథగా రిభు దాస్‌గుప్తా దర్శకత్వంలో ‘కహానీ’ ఫేమ్ సుజోయ్ ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ‘ఏకలవ్య’ తర్వాత అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్ కలిసి నటించిన రెండో చిత్రమిది. నవాజుద్ధీన్ సిద్ధీఖి మరో కీలక పాత్ర పోషించారు. విడుదల: మే 20