స్టార్ స్టార్ సమ్మర్ స్టార్... ఎవరో? | Star Star Summer Star who | Sakshi
Sakshi News home page

స్టార్ స్టార్ సమ్మర్ స్టార్... ఎవరో?

Published Tue, Apr 5 2016 10:41 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

స్టార్ స్టార్ సమ్మర్ స్టార్... ఎవరో?

స్టార్ స్టార్ సమ్మర్ స్టార్... ఎవరో?

ఈ సమ్మర్‌కి హిందీ సినీ రంగం కూడా హీటెక్కిపోతోంది. షారుక్ ఖాన్ నుంచి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ దాకా పలువురు సూపర్‌స్టార్స్ ఈ సమ్మర్ సినిమా హంగామాలో ఉన్నారు. ఆమిర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటివారు బరిలో లేరన్న మాటే కానీ, ఈ సమ్మర్ చాలా హాటే. అలాంటి కొన్ని సమ్మర్ రిలీజ్‌ల కథాకమామిషు...
 
 షారుక్ వర్సెస్ షారుక్!
 ఆర్యన్ ఖన్నా... ఓ సూపర్‌స్టార్. గౌరవ్ ఇంచుమించు అతనిలా ఉండే అభిమాని. అతనంటే ప్రాణం. చిన్నతనం నుంచి ఆర్యన్‌ను పిచ్చిగా ఆరాధించిన గౌరవ్ చివరికి ఉన్మాదిలా మారతాడు. తన అభిమాన హీరో జీవితానికి విలన్‌గా తయారవుతాడు. అప్పటి నుంచి గౌరవ్ వెనక ఆర్యన్ లాంటి సూపర్‌స్టార్ పరిగెత్తక తప్పని పరిస్థితి. అదే ఈ షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’ చిత్రం. ఈ సినిమాలో ఎన్నో విశేషాలున్నాయి. ఇంచుమించు 23 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాలో నె గటివ్ రోల్‌లో షారుక్ కనిపిస్తున్నారు. ఆయన చాలా కాలం తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా కూడా ఇదే. అందుకే అభిమానులకు ‘ఫ్యాన్’ చాలా స్పెషల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాట ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
 విడుదల: ఏప్రిల్ 15
 
 రెబల్ లవ్‌స్టోరీ!
 సియా... చూడటానికి చాలా క్యూట్ గాళ్. కానీ ఏ మాత్రం తేడా వచ్చినా చితక్కొట్టే టైప్. ఆమె జీవితంలోకి రోనీ ఎంటరవుతాడు. అతను కూడా అంతే. ఇద్దరూ రెబల్ క్యారెక్టర్స్ అన్న మాట. ఇంతలో సియాను ప్రేమించిన మరో వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసి తన నేరసామ్రాజ్యంలో దాచేస్తాడు. క్రిమినల్స్, గ్యాంగ్‌స్టర్స్‌ను దాటి ఆమెను కాపాడాలి. మరి రోనీ ఎలా పోరాడి, ఆమె దక్కించుకున్నాడనేదే ‘బాఘీ’ సినిమా కథ. సబీర్‌ఖాన్ దర్శకత్వంలో టైగర్‌ష్రాఫ్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ‘బాఘీ’ సినిమా ట్రైలర్ ఇప్పటికే యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. తెలుగు సూపర్‌హిట్ మూవీ ‘వర్షం’కి  హిందీ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ద్వారా మన తెలుగు హీరో సుధీర్‌బాబు విలన్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ‘ఆషికి-2’ నుంచి కాస్త సెలైంట్ బ్యూటీగా కనిపించిన శ్రద్ధాకపూర్ బికినీ అందాలు, పోరాటాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. విడుదల: ఏప్రిల్ 29
 
 అజారుద్దీన్ జీవితం
  టెస్టుల్లో 6216 పరుగులు... వన్డేల్లో 9378 పరుగులు......ఇదంతా భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్  ట్రాక్ రికార్డ్. కానీ ఒక్క వివాదం అతని జీవితాన్ని తలకిందులు చేయడంతో పాటు భారత క్రికెట్ చరిత్రలో అజారుద్దీన్ కెప్టెన్‌గా అందించిన విజయాలను తుడిచేసింది. అదే మ్యాచ్ ఫిక్సింగ్. అజారుద్దీన్ జీవితంలో జరిగిన  ప్రేమకథలతో పాటు మ్యాచ్‌ఫిక్సింగ్‌ను కూడా సినిమాలో చూపించనున్నారు.    టోనీ డిసౌజా దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. విడుదల: మే 13
 
 ఐష్ మీదే..అందరి కళ్లు

 అందాల తార ఐశ్వర్యా రాయ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో చేస్తున్న రెండో చిత్రం ‘సరబ్‌జిత్’.  పాక్ జైల్లో మగ్గిపోయిన భారతీ యుడు సరబ్‌జిత్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐష్ కనిపించనున్నారు. ‘మేరీకోమ్’ ఫేమ్ ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రణ్‌దీప్ హుడా టైటిల్ రోల్ పోషిస్తుండగా, అతని భార్యగా రిచా చద్దా నటి స్తున్నారు.  విడుదల: మే 20
 
 ఆ... ముగ్గురూ!
  అమితాబ్ బచ్చన్ కోలకతా వీధుల్లో స్కూటర్ మీద చక్కర్లు కొట్టిన దృశ్యాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్. ‘తీన్’ చిత్రంలోని అమితాబ్ లుక్  ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. కోల్‌కతా నేపథ్యంలో సాగే కథగా రిభు దాస్‌గుప్తా దర్శకత్వంలో ‘కహానీ’ ఫేమ్ సుజోయ్ ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ‘ఏకలవ్య’ తర్వాత అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్ కలిసి నటించిన రెండో చిత్రమిది. నవాజుద్ధీన్ సిద్ధీఖి మరో కీలక పాత్ర పోషించారు.
 విడుదల: మే 20
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement