అందమె ఆనందం
పావుకప్పు పాలపొడిలో నాలుగు చెంచాల శనగపిండి, రెండు చెంచాల బాదంపొడి, ఒక చెంచా పాల మీగడ, కొద్దిగా నిమ్మరసం వేసి పేస్టులా చేసుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తర్వాత కడిగేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. అంతేకాదు... వేసవికాలంలో వచ్చే పలు చర్మ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే, వారానికోసారైనా ప్యాక్‌ను వేసుకోవడం మంచిది.
పొడిచర్మం కలవారు గ్లిజరిన్, నిమ్మరసం, రోజ్వాటర్లను సమపాళ్లలో కలిపి రోజుకోసారైనా కాళ్లూ చేతులూ రుద్దుకుంటూ ఉంటే పొడిదనం పోయి చర్మం తేమగా అవుతుంది. పళ్లు పచ్చగా తయారైతే... టూత్పేస్లో కొంచెం బేకింగ్‌సోడా, కొద్దిగా స్ట్రాబెర్రీ పేస్ట్ కలిపి ప్రతిరోజూ పళ్లు తోముకోండి. కొన్ని రోజులు ఇలా చేస్తే పళ్లు మళ్లీ మిలమిలా మెరుస్తాయి.